కీర్తి సురేష్ ను ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆమె తెలుగు, తమిళ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ కాబట్టి..! వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తోన్న కీర్తి సురేష్.. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ఈమె నరేష్ కొడుకు నవీన్ సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా ముందుగా విడుదల కాలేదు. రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజ’ చిత్రంతో ఈమె తెలుగులో పరిచయమైంది.అటు తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కీర్తి…
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మహానటి’ తో స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉండగా…కీర్తి సురేష్ తల్లి పేరు మేనక అని.. ఆమె గతంలో హీరోయిన్ గా నటించిందని.. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో కూడా నటించిందని బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. అందులోనూ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా నటించింది అనే విషయం అస్సలు తెలిసుండదు. అవును కీర్తి తల్లి మేనక..మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది.
విషయంలోకి వెళ్తే.. 1980లో ప్రఖ్యాత ‘ఏ.వి.యం’ సంస్థ నిర్మించిన ‘పున్నమి నాగు’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎం.రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో పూర్ణిమ అనే పాత్రలో ఈమె కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!