Keerthy Suresh: హీరో రామ్ కోరిక నెరవేరుతుందా?

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన నేను శైలజ సినిమాతో కీర్తి సురేష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారనే సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ సాధించడం ఆ తరువాత కీర్తి సురేష్ నటించిన నేను లోకల్, మహానటి సినిమాలు హిట్ కావడంతో కీర్తి సురేష్ కు క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం కీర్తి టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా భోళాశంకర్ సినిమాలో కీర్తి చిరంజీవికి చెల్లెలిగా కనిపించనున్నారు.

అయితే దాదాపు ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత కీర్తి రామ్ కు జోడీగా కనిపించనున్నారని సమాచారం. రామ్ లింగుస్వామి సినిమాలో కృతిశెట్టి ఇప్పటికే హీరోయిన్ గా ఫిక్స్ కాగా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కీర్తి సురేష్ కనిపించనున్నారని తెలుస్తోంది. మన్మథుడు2, జాతిరత్నాలు సినిమాలలో కీర్తి సురేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలలో మన్మథుడు2 ఫ్లాప్ గా నిలిస్తే జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాలని రామ్ భావిస్తున్నారు.

రామ్ కల లింగుస్వామి సినిమాతో నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. లింగుస్వామి గత సినిమా సండకోళి 2లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా దర్శకుడు కోరడంతో గెస్ట్ అప్పియరెన్స్ కు కీర్తి సురేష్ వెంటనే ఓకే చెప్పారని సమాచారం. త్వరలోనే కీర్తి సురేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus