కీర్తి.. ఇలా అయితే చాలా కష్టం..!

అతితక్కువ సమయంలోనే తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కీర్తి సురేష్. ముఖ్యంగా ‘మహానటి’ చిత్రం ఈమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అంతకముందు ‘నేను శైలజ’ ‘నేను లోకల్’ వంటి చిత్రాలు ఉన్నప్పటికీ… ‘మహానటి’ చిత్రం ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది. సావిత్రి గారి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో.. సావిత్రి గా కీర్తి సురేష్ వందకు వంద శాతం న్యాయం చేసింది. ఈ చిత్రం తమిళంలో కూడా సూపర్ హిట్టైంది. దీంతో తమిళ స్టార్ హీరోలైన విజయ్, విశాల్, విక్రమ్, సూర్య వంటి వారితో నటించి అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఇదిలా ఉండగా.. తెలుగులో ఓ స్టార్ హీరో పక్కన ఈమెకు ఛాన్స్ వస్తే కథ నచ్చలేదని సాకులు చెప్పి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఇలా కీర్తి సురేష్ ఇప్పటికే చాలా కథల్ని రిజెక్ట్ చేసిందట. దీనికి అసలు కారణం కథ నచ్చకపోవడం కాదని వేరే ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే… ఆమెకు బాలీవుడ్లో రాణించాలనే కోరిక ఉందట. ఇందులో భాగంగా.. త్వరలోనే శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మించబోయే చిత్రంలో నటించబోతుందట. ఈ చిత్రం కోసం ఇప్పటికే చాలా స్లిమ్ అయిపొయింది కూడా. బాలీవుడ్ చిత్రాల్లో నటించడం కోసం ముంబైకి మకాం మార్చేసిందట. అంతేకాదు జాన్వీ కపూర్ తో కూడా స్నేహం చేస్తూ వస్తుందట. ‘టాలీవుడ్లో మంచి అవకాశాలు వదిలేసి బాలీవుడ్ లో ఇన్ని తిప్పలు పడటం ఎందకు’ అనే ఆమె సన్నిహితులు చెబుతున్నా కీర్తి మాత్రం పట్టించుకోవట్లేదట. అప్పట్లో ఇలియానా కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో బాలీవుడ్ కు వెళ్ళి ఒక్క రెండు హిట్లు పడగానే సౌత్ సినిమాలని పక్కకి పెట్టేసింది. ఇప్పుడు ఆమె బాగా లావైపోవడంతో అక్కడ అవకాశాలు రాక… తిరిగి టాలీవుడ్ కు వచ్చి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా చేసింది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు ఇక్కడ కూడా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు కీర్తి కూడా అదే తరహాలో ప్రవర్తిస్తే ఆమె పరిస్థితి కూడా ఇలా అయిపోయే ప్రమాదం ఉందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus