Keerthy Sureshd: కీర్తి సురేష్ చెల్లి పాత్ర కోసం అన్ని కోట్లు తీసుకుందా..!

వరుస ఆఫర్స్ తో ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ చెల్లి పాత్రలు చేయడానికి అసలు ఇష్టపడరు. సిస్టర్, ఫ్రెండ్ లాంటి పాత్రలు చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే ఒకే చెబుతారు. అది తమ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తారు. వాస్తవంలో కూడా చెల్లి పాత్రలు చేసే హీరోయిన్స్ ని స్టార్స్ తమకు జోడీగా తీసుకోవడానికి ఇష్టపడరు. ఈ సెంటిమెంట్ ని పక్కన పెట్టి, పాత్రలో విషయం ఉంది అనుకుంటే చేసేస్తుంది హీరోయిన్ కీర్తి సురేష్.

రజినీకాంత్ హీరోగా దీపావళి కానుకగా విడుదలైన అన్నాత్తే చిత్రంలో ఆమె హీరో చెల్లి పాత్ర చేశారు. కథలో కీలకమైన ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. భోళా శంకర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా కీర్తి కనిపించనున్న విషయం తెలిసిందే. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ అని సమాచారం. ఈ మూవీలో హీరో చెల్లి పాత్ర కీలకం కాగా, కీర్తి సురేష్ ని ఎంచుకున్నారు.

మొదట సాయి పల్లవికి ఈ ఆఫర్ వచ్చింది, అయితే ఆమె ఈ ఆఫర్ ని తిరస్కరించడం జరిగింది. అయితే ఆమె మార్కెట్, డిమాండ్ రీత్యా, చెల్లి పాత్ర అయినప్పటికీ రెమ్యూనరేషన్ మాత్రం హీరోయిన్ రేంజ్ లో తీసుకుంటున్నారట. టాలీవుడ్ లో నడుస్తున్న టాక్ ప్రకారం, భోళా శంకర్ చిత్రానికి గాను రూ. 2 కోట్లు కీర్తి రెమ్యూనరేషన్ లో తీసుకుంటున్నారట. మరి ఇదే నిజం అయితే…

బహుశా దేశంలోనే మరే నటి చెల్లి పాత్ర కోసం ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకొని ఉండరు. దీంతో ఇతర హీరోయిన్స్ కూడా చెల్లి పాత్ర కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకునేలా బాటలు వేసింది. కీర్తి సురేష్‌కి టాలీవుడ్‌లో చాలా డిమాండ్ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారి వారి పాట’లో ‘దసరా’లో నానితో స్క్రీన్ షేర్ చేసింది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus