Keerthy Suresh: సర్కారు వారి పాట మూవీలో హైలెట్ ఇదేనా..?

భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి పాట సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా మహేష్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ గా కీర్తి సురేష్ బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తున్నారని సమాచారం. మహేష్ బాబు సబార్డినేట్ గా కీర్తి సురేష్ కనిపించనున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేష్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజవుతుండటం గమనార్హం. దర్శకుడు పరశురామ్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎమ్బీ ఎంటర్టేన్మెంట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న్ పరశురామ్ సర్కారు వారి పాట సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధిస్తానని భావిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్ నత్తనడకన జరుగుతోంది. మహేష్ బాబు ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో కూడా నటించనున్నారు. వచ్చే ఏడాది తను నటించిన రెండు సినిమాలు రిలీజయ్యే విధంగా మహేష్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర హైలెట్ అని ఫ్యాన్స్ ను మెప్పించేలా కీర్తి పాత్రను దర్శకుడు పరశురామ్ తీర్చిదిద్దారని సమాచారం.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus