‘మహానటి’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్. సావిత్రి గారి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో.. నిజంగా సావిత్రిగారే నటిస్తున్నారా అనేంతలా.. నటించి ప్రశంసలు అందుకుంది కీర్తి సురేష్. అంతేకాదు ఏకంగా నేషనల్ అవార్డు కూడా కొట్టేసింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రం హిట్టవ్వడంతో అక్కడ కూడా కీర్తి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే అక్కడ దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ నటించేసింది. ఇక తెలుగులో అయితే ఆమె ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికే ఎక్కవ ఇంట్రెస్ట్ చూపిస్తుంది.
కీర్తి ప్రస్తుతం ‘మిస్ ఇండియా’ అనే విమెన్ సెంట్రిక్ చిత్రంలో నటిస్తుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఓ టీజర్ ను విడుదల చేశారు. ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇది పక్కన పెడితే.. టాలీవుడ్ భల్లాల దేవుడు రానా దగ్గుబాటి చిత్రాన్ని కీర్తి రిజెక్ట్ చేసిందట. అయితే రానా కి జోడీగా కాదండోయ్..! రానాకి ఓ కొరియన్ సినిమా బాగా నచ్చి.., దాని రీమేక్ రైట్స్ ని తీసుకున్నాడట.ఈ రీమేక్ లో కీర్తి సురేష్ అయితే బాగుంటుందని భావించాడట. ‘డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించాల్సి ఉంది. ఈ కథ కీర్తికి వినిపించగా ఆమె రిజెక్ట్ చేసిందట. కాల్షీట్స్ ఖాళీ లేవని చెప్పి ఆమె తప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా చేస్తే కీర్తితోనే చేయాలనుకున్న రానాకి పెద్ద షాకిచ్చింది కీర్తి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం సమంత ని సంప్రదిస్తున్నాడట. నందిని రెడ్డి ఈ డైరెక్టర్ గా ఫిక్సయ్యింది. హీరోయిన్ ఫిక్సయితే 2020 లో ఈ చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ జరుగుతుందట.