సెప్టెంబర్ వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగుల హడావిడి మొదలైంది. ఆగస్టులో కింగ్ అక్కినేని నాగార్జున ‘బిగ్ బాస్ 4’ ప్రోమోలు షూటింగ్ చేశారు. ‘వైల్డ్ డాగ్’ సినిమాను ఈ నెలలో సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సౌంగ్ కోసం సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ షూటింగ్ స్టార్ట్ చేశారు. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’తో పాటు తన బ్యానర్ లో ప్రొడ్యూస్ చేస్తున్న ‘వివాహ భోజనంబు’ను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.
నెమ్మదిగా ఒక్కొక్కరూ షూటింగులు మొదలు పెడుతున్నారు. ఈ లిస్టులో ‘మహానటి’ కీర్తి సురేష్ కూడా చేరింది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గుడ్ లక్ సఖి’. ఆమధ్య టీజర్ విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు నుండి సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. కరోనా వచ్చినప్పటినుండి కేరళలో సొంత ఇంటికి వెళ్లిన కీర్తి సురేష్, ఓనం పండగను సెలబ్రేట్ చేసుకుని బుధవారమే హైదరాబాద్ వచ్చారు.
‘గుడ్ లక్ సఖి’ షూటింగ్ను గురువారం నుంచి స్టార్ట్ చేశారని సమాచారం. కరోనా నేపథ్యంలో తక్కువ మందితో షూటింగ్ చేస్తున్నారట. అలాగే, జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారట. త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి పోటీకి సినిమాను ఇవ్వాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
Most Recommended Video
View this post on Instagram
#keerthysuresh spotted at hyd airport 😎😍
A post shared by Filmy Focus (@filmyfocus) on
తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!