Keerthy Suresh: వడివేలుకి జోడీగా కనిపిస్తుందా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. ‘మహానటి’ తరువాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ మళ్లీ కమర్షియల్ సినిమాల బాట పట్టింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది. అలానే కోలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో ఆయనకు చెల్లెలిగా కనిపించనుంది. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడొక కమెడియన్ తో కలిసి నటించడానికి అంగీకరించినట్లు సమాచారం.

కోలీవుడ్ లో ‘నాయ్ శేఖర్ రిటర్న్స్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కమెడియన్ వడివేలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో మరో పాత్రలో కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో వడివేలుకి జోడీ లేదని, సినిమాకి కీలకంగా నిలిచే కథానాయిక పాత్రలో కీర్తి సురేష్ నటించబోతుందని మరో వార్త వినిపిస్తుంది. మరి ఇందులో వడివేలుకి కీర్తి జోడీగా కనిపిస్తారా..? లేక కథలో కీలకపాత్రలో కనిపిస్తారో చూడాలి.

సురాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా శునకాల నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. శేఖర్ అనే పాత్రలో వడివేలు కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus