Pushpa 2: ‘పుష్ప 2’ ని పట్టించుకోని కేరళ జనాలు.. కారణం అదేనా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తుంది. మొదటి వీకెండ్ కి గాను.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.746 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా దుల్లగొట్టేస్తుంది అని చెప్పాలి. అక్కడ మొదటిరోజు కంటే మూడో రోజు ఎక్కువగా కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పుడున్న హైప్ ని బట్టి చూస్తుంటే.. ఒక్క నార్త్ లోనే ‘పుష్ప 2’ వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Pushpa 2

‘పుష్ప’ (Pushpa)  మొదటి భాగంగా పెద్ద హిట్ అయ్యింది కూడా అక్కడే. అందుకే మేకర్స్ కూడా నార్త్ లోనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. మొదటి ఈవెంట్ ను పాట్నాలో చేసి సినిమాకి భారీ హైప్ తీసుకొచ్చారు. ఆ తర్వాత చేసిన ఈవెంట్లు కూడా సక్సెస్ అయ్యాయి. ‘పుష్ప 2’ కి వచ్చిన భారీ ఓపెనింగ్స్ కి కారణం అదే అని చెప్పాలి. అంతా బాగానే ఉంది కానీ కేరళలో మాత్రం ‘పుష్ప 2’ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవు. హైప్డ్ నంబర్స్ ను బట్టి రూ.8 కోట్లు షేర్ వచ్చిందని చెబుతున్నారు కానీ వాస్తవానికి అక్కడ రూ.5 కోట్లు మాత్రమే షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

వాస్తవానికి అల్లు అర్జున్ కి తెలుగుతో పాటు భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కేరళలోనే. అందుకే ఇతన్ని మల్లు అర్జున్ అంటుంటారు. సోషల్ మీడియాలో అయితే ‘అడాప్టెడ్ సన్ ఆఫ్ కేరళ’ అంటుంటారు. ‘పుష్ప 2’ నార్త్ తర్వాత ఎక్కువ కలెక్ట్ చేసే ఏరియా కేరళ అవుతుందని అంతా అనుకున్నారు. మలయాళం ఇండస్ట్రీ హిట్ గా కూడా ‘పుష్ప 2’ నిలుస్తుందని భావించారు. కానీ సీన్ అంతా రివర్స్ అయ్యింది. మల్లు బ్యాచ్ ‘పుష్ప 2’ ని పట్టించుకోవడం లేదు.

దీనికి కారణం ఫహాద్ ఫాజిల్ అని అంతా అంటున్నారు. ‘పుష్ప 2’ లో ఫహాద్ ఫాజిల్ విలన్. సినిమాలో అతన్ని చాలా చోట్ల తక్కువ చేసి చూపించారు అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ లో ‘ఫహాద్ ఫాజిల్ ఇంటిమేట్ సీన్ ఒకటి ఉంటుంది. అతను వేరే అమ్మాయితో ప్రైవేట్ గా ఉన్నప్పుడు.. అనసూయ (Anasuya Bhardhwaj) పాత్ర డైరెక్ట్ గా తలుపు తీసుకుని లోపలికి వెళ్లడం….

ఆ తర్వాత ఫహాద్ సిగ్గుతో కర్టెన్ల వెనుక దాక్కోవడం, అలాగే ఇంటర్వెల్ సీన్ వద్ద అతను స్విమ్మింగ్ పూల్లో పడిపోతే.. హీరో అక్కడ ఉచ్చ పోయడం వంటి సీన్లు కేరళ ఆడియన్స్ ని, ఫహాద్ ఫాజిల్  (Fahadh Faasil)  ని, హర్ట్ చేసినట్టు అంతా అనుకుంటున్నారు. అయినప్పటికీ అక్కడి ఆడియన్స్ మితిమీరిన యాక్షన్ సినిమాలు చూడరు. ‘పుష్ప 2’ ఆ టైపు సినిమా కాబట్టి.. అక్కడి జనాలు ఇంట్రెస్ట్ చూపించడం లేదేమో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus