KGF 2 First Review: ‘కేజీఎఫ్2’ సినిమా ఫస్ట్ రివ్యూ & రేటింగ్ వచ్చేసింది..!

  • April 9, 2022 / 08:10 PM IST

‘కేజీఎఫ్’ సినిమాతో సక్సెస్ ఫుల్ జోష్ మీద ఉన్న యష్ దానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పార్ట్ 2లో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం దేశవ్యాప్తంగా యష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకొచ్చింది. దుబాయ్ లో సెన్సార్ షో చూసిన ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ‘కేజీఎఫ్ 2’ సినిమాకి రివ్యూ ఇచ్చారు.

కన్నడ సినిమా ఇండస్ట్రీకి ‘కేజీఎఫ్2’ సినిమా కిరీటం లాంటిదని అన్నారు. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని అన్నారు. డైలాగ్స్ కూడా చాలా షార్ప్ గా, ఎఫెక్టివ్ గా ఉన్నాయని పేర్కొన్నారు. మ్యూజిక్ చాలా బాగుందని.. ముఖ్యంగా బీజీఎమ్ హైలైట్ గా నిలిచిందని అన్నారు. దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని.. సినిమా మొత్తం ఇంటెన్సిటీ చాలా బాగా క్యారీ చేశారని చెప్పారు.

సినిమాలో ఒక్కొక్కరి పెర్ఫార్మన్స్ టెరిఫిక్ గా ఉందని రాసుకొచ్చారు. ఈ సినిమా కేవలం కర్ణాటకలో మాత్రమే బ్లాక్ బస్టర్ కాదని.. ఇదొక వరల్డ్ క్లాస్ సినిమా అని చెప్పారు. యష్, సంజయ్ దత్ తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారని.. క్లైమాక్స్ షాకిస్తుందని పేర్కొన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.

రవీనా టండన్‌ మరో కీలకపాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. అధీరాగా డిఫరెంట్ లుక్‌లో ఆయన కనిపించనున్నారు. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus