‘కేజీఎఫ్2’.. సింగిల్ డీల్ తో క్రేజీ అమౌంట్!

ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాతో హీరో యష్ కన్నడలో స్టార్ హీరోగా ఎదిగాడు. నేషనల్ వైడ్ గా కూడా అతడికి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ని తెరకెక్కిస్తున్నారు. దీంతో సినిమాకి మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ‘కేజీఎఫ్’ కంటే సీక్వెల్ సినిమాకి 70 శాతం బిజినెస్ ఎక్కువగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి శాటిలైట్ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు చెందిన శాటిలైట్ రైట్స్ ఒకేసారి అమ్ముడుపోయాయి. ఓ ప్రముఖ ఛానెల్.. ఈ సినిమా సౌత్ శాటిలైట్ రైట్స్ ను రూ.50 కోట్లకు దక్కించుకుంది. అలా సింగిల్ డీల్ తో రూ.50 కోట్లను ఆర్జించింది ఈ సినిమా. మరోపక్క ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడైపోయాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దాదాపు రూ.55 కోట్లకు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా హిందీ డబ్బింగ్, హిందీ శాటిలైట్ రైట్స్ కోసం ఎగబడుతున్నారు. నార్త్ లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అందుకే సీక్వెల్ కి సంబంధించి హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కు క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ హక్కుల కోసం జీగ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది. భారీ మొత్తానికే సినిమా డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ లాంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 16న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus