ఖరీదైన కార్లు ఈ ‘కె.జి.ఎఫ్’ స్టార్ల సొంతం.. వాటి విలువ ఎంతో తెలుసా?

2018 చివర్లో విడుదలైన కన్నడ డబ్బింగ్ సినిమా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించింది ఆ మూవీ. కన్నడ డబ్బింగ్ సినిమాలను మిగిలిన భాషల ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తూ ఉంటారు కాబట్టి..! ఉపేంద్ర సినిమాలకి మాత్రమే కొద్దో గొప్పో మార్కెట్ ఉండేది. కానీ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీ ఆ అభిప్రాయాలను మార్చేసింది.

Click Here To Watch NOW

అదేదో లాటరీలో కొట్టుకుపోయింది అన్నవాళ్ళకు ఇటీవల విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ గట్టి సమాధానం చెప్పింది. ఈ మూవీలో నటించిన నటీనటులంతా ఇండియా మొత్తం పాపులర్ అయిపోయారు. అందరికీ ఇప్పుడు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అలాగే చాప్టర్ 1 సూపర్ హిట్ అవ్వడంతో సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి స్టార్లను కూడా ఈ మూవీ కోసం తీసుకున్నారు. నార్త్ లో ఈ మూవీని ప్రమోట్ చేసుకోవడానికి అది మరింత ప్లస్ అయ్యింది.

ఇదిలా ఉండగా.. ‘కె.జి.ఎఫ్’ నటీనటుల కాస్ట్ లీ కార్ల ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఏ కార్లో.. వాటి విలువ ఎంతో మీరు కూడా ఓ లుక్కేయండి :

1) సంజయ్ దత్ : ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ లో అధీరా అనే విలన్ పాత్రలో నటించిన సంజయ్ దత్.. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు వాడుతున్నాడు. దీని విలువ రూ.4.5 కోట్లు

2) యష్ : మన రాఖీబాయ్ కు మెర్సీడీస్ జి.ఎల్.ఇ 43 ఎ.ఎం.జి అనే కారు ఉంది. దీని విలువ రూ.1.03 కోట్లు

3) రవీనా టాండన్ : ప్రధాన మంత్రి రమిక సేన్ పాత్రని పోషించిన ఈమెకు మెర్సీడీస్ జి.ఎల్.ఎస్ 350D అనే కారు ఉంది. దీని విలువ రూ.88.08 లక్షలు

4) శ్రీనిధి శెట్టి : హీరోయిన్ గా రీనా పాత్ర పోషించిన ఈమెకు బి.ఎం.డబ్ల్యు 5 సిరీస్ కారు ఉంది. దీని విలువ రూ.65.50 లక్షలు

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus