KGF3: యశ్‌ కొత్త సినిమా ఇప్పట్లో కష్టమే అంటున్నారు… ఎందుకంటే?

సినిమాను రెండు పార్టులుగా తీస్తేనే ‘రెండు పార్టులా’ అంటూ క్వశ్చన్‌ మార్క్‌ ఫేస్‌లు పెట్టుకుంటున్న రోజులివి. ‘బాహుబలి’, ‘కేజీయఫ్‌’, ‘పుష్ప’ ఇలాంటి సినిమాలే. అయితే ఇందులో రెండో సినిమాకు మూడో పార్టు కూడా ఉందని రెండో పార్టు ఆఖరులో చెప్పారు. అయితే ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అసలు ఎప్పుడు స్టార్ట్‌ అనేది చెప్పడం లేదు. మరోవైపు హీరో యశ్‌ కూడా కొత్త సినిమా ఇంకా ఏదీ ఓకే చేయలేదు. దీంతో ‘కేజీయఫ్‌ 3’కి, యశ్‌కి ఏమైంది అనే చర్చ మొదలైంది.

ఈ క్రమంలో సమాధానం కూడా వచ్చేసింది. ‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్‌కు ఎదురైన పరిస్థితే ఇప్పుడు ‘కేజీయఫ్‌ 2’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌, యశ్‌కి ఎదురైంది అంటున్నారు. ‘కేజీయఫ్ 1’ సినిమాకు ఊహించని విజయం దక్కింది. ఆ రేంజ్‌లో సినిమా ఉంటుందని, ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. అలాంటి సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీయఫ్ 2’ వచ్చింది. ఆ సినిమా కూడా అంచనాలను దాటి భారీ విజయం సాధించింది. దీంతో వాటకి మించి ‘కేజీయఫ్‌ 3’ ఉండాలని దర్శక హీరో అనుకుంటున్నారట.

ఈ క్రమంలో ‘కేజీఎఫ్ 3’ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని తాజా సమాచారం. యష్, ప్రశాంత్ నీల్ మధ్య ఈ మేరకు చర్చలు జరిగాయని, ఇప్పట్లో మూడో ‘కేజీయఫ్‌’ వద్దు అనుకున్నారని అంటున్నారు. పాన్‌ ఇండియాను దాటి ప్రపంచానికి వెళ్లిపోయిన ‘కేజీయఫ్’ రెండు సినిమాల స్థాయిలో మూడో ‘కేజీయఫ్‌’ కథ, కథనం, ప్లానింగ్‌ సిద్ధమయ్యేవరకు మొదలుపెట్టకూడదు అనుకుంటున్నారట.

మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా బిజీగా ఉన్నారు. ప్రభాస్‌తో ‘సలార్‌’ సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా విడుదలకు రెడీగా ఉండగా, అదొచ్చాక రెండో పార్టు సంగతి తేలుతుంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత చిరంజీవి, రామ్‌చరణ్‌ సినిమా ఉంటుంది అంటున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే ‘కేజీయఫ్‌ 3 (KGF3)’ మీద టీమ్‌ కూర్చునే అవకాశం ఉందట.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus