KGF Chapter 2: రిలీజ్ డేట్ వచ్చేసింది!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి చాలా పవర్ఫుల్ సినిమాలు రాబోతున్నాయి. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద హంగామా మామూలుగా ఉండదు. ఇక అందరి చూపు ఎక్కువగా KGF చాప్టర్ 2 పైనే ఉంది. యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ బడ్జెట్ తో రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా రిలీజ్ కోసం గత ఏడాది నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి చిత్ర యూనిట్ విడుదలపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసింది. మొదటి నుంచి కూడా ఈ సినిమా సమ్మర్ లోనే రానున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ సమ్మర్ చివరలో సినిమా రానున్నట్లు చెప్పేశారు. జూలై 16న సినిమా దేశవ్యాప్తంగా కన్నడ తమిళ్ హిందీ మలయాళం తమిళ్ భాషల్లో రిలీజ్ కానున్నట్లు. పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తి చేసిన విషయం తెలిసిందే. KGF చాప్టర్ 1 కంటే హై యాక్షన్ డోస్ ఉండేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రెడీ చేస్తున్నాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. రేపో మాపో ఆ పనులన్నీ కూడా అయిపోతాయి. ఇక రెగ్యులర్ ప్రమోషన్స్ ను కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. మరి KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో లాభాలను అందిస్తుందో చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus