టాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న ఎన్టీఆర్ స్టార్ డమ్ గత ఐదేళ్లలో భారీగా పెరిగింది. ఆయనకు ఇతర పరిశ్రమలో కూడా అభిమానులు ఏర్పడ్డారు. కొన్నాళ్లుగా ఆయన వరుస విజయాలు అందుకోవడమే ఇందుకు కారణం. ఇక కన్నడ పరిశ్రమకు చెందిన దర్శకుడు కే జి ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఎప్పటి నుండో ఎన్టీఆర్ తో మూవీ చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ వీరిద్దరి కాంబినేషన్ మూవీ నిర్మించాలని తీవ్ర ప్రయత్నాలలో చేస్తున్నారు.
ఇప్పటికే ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ మధ్య దీని గురించిన చర్చలు కూడా జరిగాయి. ఎన్టీఆర్ తన 30వ చిత్రం కూడా దాదాపు ప్రశాంత్ నీల్ తో చేయాలని కమిట్ అయ్యారు. ఐతే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కే జి ఎఫ్ 2 మూవీ చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆయన ఈ ఏడాది అక్టోబర్ వరకు ఆ ప్రాజెక్ట్ నుండి బయటికి రాలేదు. దీనితో బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్న త్రివిక్రమ్ కి తన 30వ చిత్రం తెరకెక్కించే బాధ్యతలు అప్పగించాడు ఎన్టీఆర్.
త్రివిక్రమ్ మే నుండి ఈ మూవీ షూటింగ్ మొదలుపెడతానని ఎన్టీఆర్ కి చెప్పడంతో ఆర్ ఆర్ ఆర్ తో పాటు త్రివిక్రమ్ మూవీ కూడా పూర్తి చేయవచ్చేనే ఆలోచనతో ఆయన అలా చేశారట. కాగా త్రివిక్రమ్ మూవీ విడుదల అనంతరం ఎన్టీఆర్ చేయబోయే మూవీ ప్రశాంత్ నీల్ తోనే నట. అలాగే ఈ చిత్రం కూడా పాన్ ఇండియా మూవీ భారీ స్థాయిలో విడుదల చేస్తారట. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి ఆ స్థాయి మూవీ అదేనని టాలీవుడ్ టాక్.
Most Recommended Video
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు