ఎన్టీఆర్ తో మూవీపై హింట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!

ఎట్టకేలకు ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్ పై హింట్ దొరికింది. ఎన్టీఆర్ 31వ చిత్రం కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఉంటుందన్న విషయం స్పష్టం అయ్యింది. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తుండగానే ఆయన 30వ చిత్రంపై అనేక కథనాలు రావడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసే దర్శకుల లిస్ట్ లో ముఖ్యంగా మూడు పేర్లు వినిపించాయి. వారిలో ప్రశాంత్ నీల్, అట్లీ మరియు త్రివిక్రమ్ ఉన్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్, అట్లీలలో ఎవరో ఒకరితో మూవీ చేయడానికి ఒప్పుకుంటారు అని ఎక్కువ మంది భావించారు. ఐతే అనూహ్యంగా ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రంతో 30వ చిత్రం ప్రకటించారు. అల వైకుంఠపురంలో భారీ విజయం సాధించడంతో పాటు, అంతకు ముందే ఉన్న కమిట్మెంట్ కారణంగా ఎన్టీఆర్ ఆయనతో మూవీకి ఒప్పుకోవడం జరిగింది.

ఇక ఎన్టీఆర్ 31వ చిత్రం ప్రశాంత్ నీల్ తోనే ఉంటుందని కొద్దిరోజులుగా వరుస కథనాలు వస్తుండగా నేడు దీనిపై ఓ హింట్ వచ్చింది. ఎన్టీఆర్ కి బర్త్ డే విశెష్ తో పాటు, వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీపై కూడా పరోక్ష ప్రకటన చేశాడు ప్రశాంత్ నీల్. ‘న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చోవడం ఎంత ప్రమాదమో నాకు తెలుసు,ఈ సారి ఆ ప్లాంట్ రేడియేషన్ తట్టుకోవడానికి మంచి సూట్ ధరించుకొని వస్తాను, హ్యాపీ బర్త్ డే బ్రదర్,స్టే సేఫ్.. త్వరలో కలుద్దాం ‘ అని ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ లాంటి స్టార్ ని డీల్ చేయడం అంత ఈజీ కాదు, కానీ మంచి పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో అన్నివిధాలా సిద్దమై వస్తాను, అని ప్రశాంత్ నీల్ పరోక్షంగా చెప్పారు. దీనితో ఎన్టీఆర్ 31వ చిత్రం ప్రశాంత్ నీల్ తో చేస్తున్నాడు అనేది స్పష్టం అయ్యింది. ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దాదాపు 17కోట్ల రెమ్యూనరేషన్ ప్రశాంత్ నీల్ తీసుకుంటుంటున్నట్లు సమాచారం ఉంది. భారీ పాన్ ఇండియా మూవీ ఈ చిత్రం పలు భాషాల్లో విడుదల కానుంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
తన 19 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్టీఆర్ వదులుకున్న 12 హిట్ సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus