కన్నడ టాప్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా?

ప్రభాస్ ‘సాహో’ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది. గత రెండేళ్ళుగా ప్రభాస్ చిత్రం ఒక్కటి కూడా విడుదల కాలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశక్తితో ‘సాహో’ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 15 న విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రంతో పాటు రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో మరో చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 2020 సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని ఓ కన్నడ టాప్ డైరెక్టర్ తెగ ట్రై చేస్తున్నాడట.

ఇటీవల ‘యూవీ క్రియేషన్స్’ వారిని కలిసి ఈ కథ వినిపించగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. వాస్తవానికి మొదట ఈ కథని కన్నడ స్టార్ హీరో యశ్ కు వినిపించాడట. అయితే ఆ కథ నాకంటే.. ప్రభాస్ లాంటి పెద్ద హీరోకైతేనే బాగుంటుందని చెప్పాడట. అందుకే ఈ కన్నడ టాప్ డైరెక్టర్ ప్రభాస్ వద్దకు రాబోతున్నాడట. తాజాగా ప్రభాస్ హైదరాబాద్ వచ్చాడు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి కూడా..! ఎలాగూ ప్రభాస్ హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి ఈవారమే కలిసి ఆ కన్నడ టాప్ డైరెక్టర్ కథ చెప్పబోతున్నాడట. ఒకవేళ కథ నచ్చి డార్లింగ్ ఓకే చెప్తే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఇదే కథని యూవీ క్రియేషన్స్ వారు మరో హీరోతో చేసే అవకాశం ఉందట. అయితే ఈ కన్నడ టాప్ డైరెక్టర్ ‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రం కాదట. మరి ఆ టాప్ డైరెక్టర్ ఎవరనేది మాత్రం సస్పెన్సుగానే ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus