గతేడాది చేసినట్టు ఈ ఏడాది ఆ హడావిడి చెయ్యకండి : యష్

‘కె.జి.ఎఫ్’ చిత్రంతో సౌత్ తో పాటు నార్త్ లో కూడా స్టార్ హీరో అయిపోయాడు యష్. ఇప్పుడు అతను నటించే ప్రతీ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందాల్సిందే. ప్రస్తుతం ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ లో నటిస్తున్నాడు యష్. ఈ మధ్యనే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్ వంటి స్టార్లు నటిస్తున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.కాగా జనవరి 8న యష్ పుట్టినరోజు కావడంతో.. ఎంతోమంది అభిమానులు యష్ ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపాలని నిశ్చయించుకున్నారు.

అయితే కరోనా స్ట్రైన్ హడావిడి ఎక్కువవుతున్న ఈ టైములో అలాంటివి ఏమీ వద్దు అంటూ అభిమానులను వేడుకున్నాడు యష్. ఈ విషయం పై స్పందిస్తూ తన సోషల్ మీడియాలో ఓ వీడియోని విడుదల చేసాడు. యష్ మాట్లాడుతూ.. “గతేడాది నా బర్త్ డే రోజున నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడానికి చాలా మంది అభిమానులు దూర ప్రాంతాల నుండీ వ‌చ్చారు. అయితే ఈసారి క‌రోనా కారణంగా జర్నీ చెయ్యడం అంత మంచిది కాదు. ఎవ‌రైనా నాకు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు చెప్పాలనుకుంటే సోష‌ల్ మీడియా ద్వారా చెప్పండి.

‘కె.జి.ఎఫ్2’ టీజర్ తో నా బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకోండి. దయచేసి ఈ టైములో రిస్క్ చెయ్యొద్దు.. ఎవ్వరినీ రిస్క్ లో పెట్టొద్దని మనవి చేసుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ‘కె.జి.ఎఫ్2’ పూర్తయ్యాక టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ తో ఓ సినిమా చెయ్యడానికి యష్ ఓకే చెప్పినట్టు టాక్ నడుస్తుంది. మరి ఆ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.


2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus