కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న `కే.జి.ఎఫ్‌`..!

క‌న్న‌డ హీరో య‌శ్ హీరోగా ప్ర‌శాంత్‌నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ ప‌తాకం పై విజ‌య్ కిరంగ‌దుర్‌ నిర్మించిన‌ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `కె.జి.ఎఫ్‌`. తాజా విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు కాస్త డేవిడ్ టాక్ వచ్చినప్పటికీ.., రెండో రోజు నుండీ జోరు పెంచింది. మాస్ సినిమాకి సరికొత్త నిర్వచనంగా సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు చేస్తుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 58 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టి 100 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రం మొదటి రోజు కంటే కూడా ఎక్కువ వసూళ్ళు సోమవారం రోజున దక్కించుకుందట. ఇక నిన్న క్రిస్మస్ సెలవు కావడంతో.. 5 వ రోజు పూర్తి చేసుకునే సరికి `కె.జి.ఎఫ్‌` చిత్రం దాదాపు 91 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూల్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి వారంలోనే ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్ లో చేయడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు. 2018 లో ఇది మంచి ఎండింగ్ అని చెబుతున్నారు ఫిలిం విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. ఈ చిత్ర తెలుగు వెర్ష‌న్ హక్కులను వారాహి చ‌ల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus