సోషల్ మీడియాలో వైరల్.. ఫ్యాన్స్ హల్ చల్ ..!

కొన్ని వార్తలు ఎక్కడ్నుంచీ పుడతాయో కానీ ఇట్టే వైరల్ అయిపోతాయి. అవి ఫ్యాన్స్ గ్రూప్స్ లో తెగ షేర్ అయిపోతాయి. గాసిప్ ఆఫ్ ద డే గా నిలుస్తాయి. ఇంతకీ ఇప్పుడు మేటర్ ఏంటంటే, సౌత్ ఇండియాలోనే దర్శకదిగ్గజంగా పేరుపొందిన శంకర్ తన తర్వాత సినిమా ఎవరితో తీయబోతున్నాడు అనేది. ప్రస్తుతం కోలీవుడ్ లో విశ్వనటుడు కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు 2 సినిమాని చేస్తున్నాడు శంకర్. ఈ సినిమా షూటింగ్ కి ఎన్నో అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కుని మరీ షూటింగ్ కంప్లీట్ చేస్కుంటోంది. దీనికోసం ప్రత్యేకమైన స్టంట్ మాస్టర్స్, ఆస్ట్రేలియాన్ మేకప్ మాన్స్ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి పక్కనబెడితే,

భారతీయుడు 2 సిినిమా తర్వాత డైరెక్టర్ శంకర్ యష్ తో సినిమా చేస్తున్నాడని వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యష్ ఇప్పటికే కొంతమంది స్టార్ డెైరెక్టర్స్ తో కమిట్ అయ్యాడని వార్తలు వినిపించిన నేపథ్యంలో ఈ వార్త హాట్ ఆఫ్ ద టాపిగ్ గా మారింది. పాన్ ఇండియన్ స్టార్ గా మారిన యష్ కేజీఎఫ్ సినిమా అప్పుడే ఈ వార్త వినిపించింది. కానీ, అఫీిషియల్ గా మాత్రం ఎలాంటి ఎనౌన్స్ మెంట్ లేదు. మళ్లీ ఇప్పుడు చాప్టర్ 2 అప్పుడు కూడా ఇదే న్యూస్ వినిపిస్తోంది.

అయితే, ఈసారి కోలీవుడ్ తంబీల నుంచి ఈ న్యూస్ రావడం విశేషం. ఎప్పట్నుంచో శంకర్ సీక్వల్ కాకుండా మళ్లీ తన మార్క్ ఉండేలా సినిమా చేయాలని చూస్తున్నాడు. నిజానికి ఐ సినిమా ఆశించినంత ఫలితం రాకపోవడం అనేది శంకర్ మార్కెట్ ని కాస్త దెబ్బతీసింది. ఆ తర్వాత రోబో సీక్వల్, ఇప్పుుడు భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. అయితే ఈసారి స్ట్రయిట్ గా పాన్ ఇండియన్ స్టార్ గా నిలిచిన యష్ తో ఒక కమర్షియల్ కథని చేయబోతున్నాడని, ఈ కాంబో ఫిక్స్ అయ్యిందని న్యూస్ వినిపిస్తోంది. అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందని కూడా చెప్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఈ విషయాన్ని తెగ షేర్ చేస్తు సంబరాలు మొదలెట్టేశారు. అదీ మేటర్.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus