కన్నడ హీరో యష్ ని సూపర్ స్టార్ గా చేసింది ‘కేజీఎఫ్’ సినిమా. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ వస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో.. ఈ సినిమా కోసం కూడా అలానే ఎదురుచూస్తున్నారు.
దీంతో ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం యాభై నుండి అరవై కోట్ల రేట్ కోట్ చేస్తున్నారు. కానీ కన్నడ నిర్మాతలు ఆ మొత్తానికి సినిమా రైట్స్ ఇవ్వాలని అనుకోవడం లేదట. తెలుగు హక్కులను కనీసం రూ.80 కోట్లకు అమ్మాలని చూస్తున్నారు. అయితే ఇంతమొత్తం పెట్టి సినిమా కొనడానికి తెలుగు నిర్మాతలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అందుకే భారీగా ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో.. వాళ్లకి డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇస్తారు. కేవలం డిస్ట్రిబ్యూషన్ మాత్రమే అనేది గమనించాల్సిన విషయం.
లాభం, నష్టం రెండూ కూడా నిర్మాతల భాద్యతే. ఈ మేరకు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. సినిమాకి ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాకపోతే మొత్తం అడ్వాన్స్ వెనక్కి ఇస్తామని నిర్మాతలు మాట ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ డీల్ కి దిల్ రాజు ఒప్పుకుంటాడా..? లేదా..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!