మెగాస్టార్ చిరంజీవి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. 2007 లో వచ్చిన ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత ఆయన నుండీ మరో సినిమా రాలేదు. దాదాపు 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘కత్తి’ కి రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది.
శంకర్ , కత్తి శీను వంటి పాత్రల్లో చిరు ద్విపాత్రాభినయం కనపరిచారు.కాజల్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. 2017 వ సంవత్సరం జనవరి 11న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 19.80 cr |
సీడెడ్ | 15.30 cr |
ఉత్తరాంధ్ర | 13.10 cr |
ఈస్ట్ | 8.17 cr |
వెస్ట్ | 6.05 cr |
గుంటూరు | 7.40 cr |
కృష్ణా | 5.75 cr |
నెల్లూరు | 3.45 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 79.02 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 25.84 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 104.86 cr |
‘ఖైదీ నెంబర్ 150’ చిత్రానికి రూ.87.87 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.104.86 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకి రూ.16.99 కోట్ల లాభాలను అందించింది ‘ఖైదీ నెంబర్ 150’.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!