మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖిలాడి’. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని.. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ‘పెన్ స్టూడియోస్’, ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ల పై కోనేరు సత్య నారాయణ నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.కానీ ఫిబ్రవరి 11న విడుదలైన ‘ఖిలాడి’ చిత్రం.. మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది.
దాంతో కలెక్షన్లు సొ సొగా నమోదవుతున్నాయి.అయితే 6 వ రోజున కూడా ఈ చిత్రం పర్వాలేదు అనిపించే విధంగా రాబట్టింది. అయితే మరో వారం రోజుల పాటు ఇదే విధంగా రాబడితే తప్ప గట్టెక్కడం కష్టమనే చెప్పాలి.
ఒకసారి 6 డేస్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
3.61 cr
సీడెడ్
1.56 cr
ఉత్తరాంధ్ర
1.36 cr
ఈస్ట్
0.71 cr
వెస్ట్
0.59 cr
గుంటూరు
0.98 cr
కృష్ణా
0.53 cr
నెల్లూరు
0.48 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
9.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
1.85 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
11.67 cr
‘ఖిలాడి’ చిత్రానికి రూ.22.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.11.67 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.11.33 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 వ రోజు అయిన బుధవారం నాడు కూడా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.0.55 కోట్ల పైనే షేర్ ను నమోదు చేసింది.
సినిమా స్టడీగానే రాణిస్తుంది కానీ…. ఇప్పటివరకు 50 శాతం మాత్రమే రికవర్ చేసింది. మరో వారం పాటు ఇదే విధంగా రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు.