విమర్శలను బోల్డ్ గా తిప్పికొట్టిన కైరా

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు వారికీ బాగా దగ్గరైంది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. ఈ రెండు సినిమాల మధ్య కైరా ఓ వెబ్ సిరీస్ లో నటించింది. కరణ్‌ జోహార్‌, అనురాగ్‌ కశ్యప్, దివాకర్‌ బెనర్జీ, జోయా అక్తర్‌ కలిసి డైరక్ట్ చేసిన ఈ సిరీస్ పేరు “లస్ట్‌ స్టోరీస్‌”. రోనీ స్క్రూ‌వాలా నిర్మించిన ఈ సిరీస్ లో కైరాతోపాటు రాధికా ఆప్టే, భూమి పెడ్నేకర్‌, మనీషా కొయిరాలా, నేహా ధుపియాలు ప్రధాన పాత్రలు పోషించారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సిరీస్ జూన్‌15న విడుదలై మంచి స్పందన అందుకుంది. ముఖ్యంగా కైరాకి అభినందనల వర్షం కురుస్తోంది. అంతేవిధంగా విమర్శలు ఎక్కువగానే అందుకుంటోంది.

సెక్స్ టాయ్ తో శృంగార అనుభవాన్ని పొందే ఓ సన్నివేశంలో ఎలా నటించావ్‌.? అని ప్రశ్న ఎక్కువగా ఆమెకి ఎదురవుతోంది. అందుకు ఆమె బోల్డ్ గా సమాధానమిచ్చింది. “అందులో తప్పేముంది.? అదీ నటనలో బాగమే కదా.” అని వెల్లడించింది. నిజజీవితంలో పెళ్ళికి ముందు సెక్స్ గురించి మాట్లాడుతూ.. “ఎవరి ఇండివిడ్యువాలిటీ వారిది. ఎవరి ఆలోచనలు వారివి. సెక్స్‌ కోరికలు పుట్టడం నేరమేమీ కాదు, వాటిని అదుపులో ఉంచుకోవడం, ఉంచుకోకపోవడం మాత్రం ఆయా వ్యక్తులకు సంబంధించిన విషయం. వాటిని నేను జడ్జ్‌ చేయలేను. నాకు సంబంధించినంతవరకు లస్ట్‌, సెక్స్‌ అన్న విషయాలకు అప్పుడే తావు లేదు” అని కైరా అద్వానీ స్పష్టం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus