బాహుబలి రికార్డ్స్ ని బద్దలుకొట్టేందుకు ప్లాన్!

తెలుగులో ఎంతోమంది హీరోలు, విలన్లు ఉన్నప్పటికీ ఈగ సినిమాలో కన్నడ హీరో సుదీప్ కి విలన్ గా అవకాశమిచ్చారు. అంతేకాదు.. ఆ తర్వాత బాహుబలి సినిమాలోనూ మంచి రోల్ ఇచ్చారు. ఇలా తెలుగు వారికి దగ్గరైన సుదీప్.. తెలుగులో కొనసాగడానికి ఇష్టపడలేదు. కన్నడలోనే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. హీరోగానే కాకుండా డైరక్టర్ గా హిట్స్ అందుకున్న సుదీప్ రాజమౌళికి షాక్ ఇచ్చే పనిలో పడ్డారు. బాహుబలి సినిమాలు భాషా భేదం, ప్రాంతీయ బేధం లేకుండా అన్ని ప్రాంతాల్లో విజయం సాధించింది. అటువంటి జానపద కథని సుదీప్ రెడీ చేసినట్లు తెలిసింది. ఈ కథని అన్ని హంగులతో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.

భారీ సెట్స్ తో పాటు.. గ్రాఫిక్స్.. స్పెషల్ ఎఫక్ట్స్ రాజీ పడకుండా సమకూర్చడానికి ఓ అంతర్జాతీయ సంస్థని కూడా నిర్మాతగా పట్టినట్టు కన్నడ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఏకకాలంలో ఈ సినిమా దక్షిణాది భాషల్లో రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. దీనిని హిందీలోనూ అనువాదంగా చేయడానికి వీలుగా స్క్రిప్ట్  రాస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ విధంగా రాజమౌళికి సుదీప్ షాక్ ఇవ్వబోతున్నారు. బాహుబలి ఎంతోమందికి స్ఫూర్తి నిచ్చింది. అందులో సుదీప్ ఒకరని.. అతనికి రాజమౌళి సహాయం కూడా ఉంటుందని దర్శకధీరుడి అభిమానులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus