King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

ప్రముఖ కథానాయకుడు నాగార్జున తన వందో సినిమా కోసం చాలా రకాల ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు ఓ సినిమా ప్రారంభించారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ మొదలై చాలా రోజులు అవుతున్నా.. ఇంకా ఎలాంటి అప్డేట్‌ లేదు. సినిమా మొదలైందని తెలుసు, ఆ సినిమాలో టబు ఓ హీరోయిన్‌గా నటిస్తోందని తెలుసు.. ఆ సినిమాకు రా.కార్తిక్‌ దర్శకుడని తెలుసు. మిగిలిన విషయాలేవీ ఎవరూ చెప్పడం లేదు. అయితే ఇప్పుడు స్పెషల్‌ డే నాడు సినిమా అప్‌డేట్స్‌ ఇవ్వడం షురూ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది.

King 100

ఆ స్పెషల్‌ డేనే సినిమా హీరో అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. వచ్చే నెల అంటే ఆగస్టు 29న నాగార్జున పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. ఆ రోజున నాగార్జున నుండి రెండు అప్‌డేట్స్‌ వస్తాయట. ఒకటి తన వందో సినిమా ‘కింగ్‌ 100’ (వర్కింగ్‌ టైటిల్‌) నుండి టీజర్ వీడియో రిలీజ్‌ చేస్తారట. ఈ సినిమాలో నాగార్జున నాలుగైదు రకాల పాత్రల్లో కనిపిస్తాడు అని ఇప్పటివరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాటి గ్లింప్స్‌ ఇప్పుడు స్పెషల్‌ వీడియోలో చూపిస్తారు అని అంటున్నారు.

అలాగే, ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. అయితే రీసెంట్‌ అప్‌డేట్స్‌ ప్రకారం నాగార్జున బాగా అచ్చొచ్చే డిసెంబరుకు సినిమా మార్చాలని చూస్తున్నారట. ఆ నెలను టార్గెట్‌ చేస్తూ సినిమాను శరవేగంగా పరుగులెత్తిస్తున్న బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని సినిమా షూటింగ్‌ అనుకోకుండా నిలిచిపోయింది. బాలకృష్ణ ఇటీవల ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌లో గాయపడటంతో శస్త్రచికిత్స చేశారు. దీంతో ఈ సినిమా స్లాట్‌లోకి నాగార్జున తన కింగ్‌ 100ని తీసుకొస్తారని టాక్‌.

ఈ నేపథ్యంలో సినిమా టైటిల్‌, రిలీజ్‌ డేట్‌ వచ్చే నెల 29న తెలిసిపోతాయి అంటున్నారు. ఈ సినిమా తర్వాత నాగ్‌ చేయబోయే సినిమా గురించి కూడా ఆ రోజు తేలబోతోంది అని చెబుతున్నారు.

 స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus