విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా 2వ వీకెండ్ ను ఆశించిన స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోయింది. ‘అతడు’ సినిమా రీ రిలీజ్ కోసం చాలా థియేటర్లు వెళ్లాల్సి ఉండగా… 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే అవకాశం ఉందని గట్టిగా హోల్డ్ చేశారు. కానీ హోల్డ్ చేసిన థియేటర్స్ కూడా ఫుల్స్ పడలేదు. తెలంగాణ ఏరియాల్లో ఒక్క థియేటర్ కూడా హౌస్ ఫుల్ పడలేదు.
జూలై 31న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. మొదటి వీకెండ్ ఓపెనింగ్స్ ఓకే అనిపించాయి. కానీ వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 12.07 cr |
సీడెడ్ | 4.41 cr |
ఉత్తరాంధ్ర | 3.47 cr |
ఈస్ట్ | 2.0 cr |
వెస్ట్ | 1.18 cr |
గుంటూరు | 1.64 cr |
కృష్ణా | 1.35 cr |
నెల్లూరు | 0.90 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 27.02 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.74 cr |
మిగిలిన వెర్షన్లు | 0.67 cr |
ఓవర్సీస్ | 9.45 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 41.88 cr (షేర్) |
‘కింగ్డమ్’ చిత్రానికి రూ.50.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.52 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 రోజుల్లో ఈ సినిమా రూ.41.88 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.77.73 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.10.12 కోట్లు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక బ్రేక్ ఈవెన్ సాధించడం అయితే ఆల్మోస్ట్ కష్టమనే చెప్పాలి