దగ్గుబాటి రానా కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలే చేస్తూ వచ్చారు. ముఖ్యంగా హీరో ఇమేజ్ కి స్ట్రక్ అయిపోకుండా మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలు చేస్తూ వచ్చారని చెప్పాలి. ‘బాహుబలి’ తో రానాకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిందని అంతా అనుకుంటారు. కానీ ‘బాహుబలి’ ని నార్త్ లో ఎక్కువగా ప్రమోట్ చేసి.. దాని రీచ్ పెంచింది రానానే అని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ తర్వాత కూడా రానా మార్కెట్ పెంచుకోవాలనే ఉద్దేశంతో కాకుండా విలక్షణమైన పాత్రలు, విభిన్న కథాంశంతో కూడుకున్న సినిమాలు చేస్తూ వచ్చారు.
అలా ‘బాహుబలి 2’ తర్వాత రానా చేసిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఫేడౌట్ దశకి దగ్గరయ్యాడు అనుకున్న తేజ ఈ చిత్రానికి దర్శకుడు. కాజల్ హీరోయిన్. పెద్దగా అంచనాలు లేకుండా 2017 ఆగస్టు 11న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 8 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 8.58 cr |
సీడెడ్ | 3.09 cr |
ఉత్తరాంధ్ర | 3.0 cr |
ఈస్ట్ | 1.9 cr |
వెస్ట్ | 1.0 cr |
గుంటూరు | 1.54 cr |
కృష్ణా | 1.50 cr |
నెల్లూరు | 0.58 cr |
ఏపీ+తెలంగాణ | 21.19 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.90 cr |
ఓవర్సీస్ | 1.95 cr |
వరల్డ్ టోటల్ | 25.04 cr (షేర్) |