‘ది ఫ్యామిలీ స్టార్’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని విజయ్ దేవరకొండ చేసిన సినిమా ‘కింగ్డమ్’. దాదాపు 7 ఏళ్ళుగా విజయ్ దేవరకొండకి సరైన హిట్టు లేదు. ‘మైత్రి’ లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ ‘ఖుషి’ సినిమాలు యావరేజ్ గా నడిచినా.. మిగిలిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘లైగర్’ ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు అన్నీ డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. దీంతో విజయ్ కొంత గ్యాప్ తీసుకుని ‘కింగ్డమ్’ చేశాడు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘#VD12’ గా ఈ సినిమా ప్రారంభమైంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ వంటివి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ పొందాయి. సినిమాపై అంచనాలు పెంచాయి. జూలై 31న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని నిర్మాత నాగవంశీ ఇండస్ట్రీకి చెందిన స్నేహితులు అంటే దిల్ రాజు వంటి కొంతమంది నిర్మాతలతో సహా కొంతమంది సన్నిహితులకు చూపించడం జరిగింది.
సినిమా చూసిన తర్వాత తమ అభిప్రాయాన్ని వారు షేర్ చేసుకోవడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ 15 నిమిషాలు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. విజయ్ దేవరకొండ కెరీర్లోనే బెస్ట్ ఎంట్రీ సీన్ పెట్టారట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అతని లుక్స్ చాలా బాగుంటాయట. పెర్ఫార్మన్స్ కూడా బాగా చేశాడని అంటున్నారు. హీరోయిన్ భాగ్యశ్రీ గ్లామర్ తో పాటు పెర్ఫార్మన్స్ తో కూడా మంచి వేయించుకుంటుందట. సత్యదేవ్ క్యారెక్టర్ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. అలాగే నెగటివ్ రోల్ చేసిన వెంకటేష్ పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుందట.
ఈ సినిమా తర్వాత తెలుగులో అతను బిజీ అయిపోతాడని అంటున్నారు. సెకండాఫ్ లో ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యింది అంటున్నారు. సెకండ్ పార్ట్ కు ఇచ్చిన లీడ్ కూడా బాగుందని అంటున్నారు. కచ్చితంగా విజయ్ కెరీర్ కి బూస్టప్ ఇచ్చేలా ఈ సినిమా ఉందని అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో..!