Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా ఇటీవల అంటే జూలై 31న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకునే టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతోంది. ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదు అనిపించినా.. అద్భుతాలు అయితే ఏమీ చేయలేదు అనే చెప్పాలి. అది కూడా వీకెండ్ వరకు మాత్రమే.

Kingdom OTT Release

వీక్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్స్ బాగా పడిపోయాయి. 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునే అవకాశాలు అయితే కనిపించడం లేదు. దీంతో బయ్యర్స్ కి కొంత మొత్తం నష్టాలు తప్పవనేది ట్రేడ్ పండితుల టాక్. మరోపక్క ‘కింగ్డమ్’ ని థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూడాలని ఆశపడుతున్నారు.

‘కింగ్డమ్’ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. నిర్మాత నాగవంశీ ప్రతి సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేస్తూ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘కింగ్డమ్’ కి 5 వారాల థియేట్రికల్ రన్ కు నెట్ ఫ్లిక్స్ సంస్థ అనుమతి ఇచ్చింది. కానీ ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం ఒక వారం రోజులు పోస్ట్ పోన్ చేశారు నాగవంశీ. దీంతో ‘కింగ్డమ్’ కి 4 వారాల థియేట్రికల్ రన్ గడువు మాత్రమే లభించింది. ఆగస్టు 28 నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రన్ కనుక బాగుంటే మరో వారం నెట్ ఫ్లిక్స్ సంస్థ థియేట్రికల్ రన్ కి అనుమతి ఇచ్చి ఉండేది. కానీ ఆశించిన స్థాయిలో ‘కింగ్డమ్’ థియేటర్లలో పెర్ఫార్మ్ చేయడం లేదు కాబట్టి.. ఆగస్టు 28 కే ఓటీటీలో స్ట్రీమింగ్ కి నిర్మాత నాగవంశీ కూడా అంగీకరించాల్సి వచ్చినట్టు తెలుస్తుంది.

ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus