ఘనంగా కిరాక్ ఆర్పీ నిశ్చితార్ధ వేడుక.. సందడి చేసిన జబర్దస్త్ బ్యాచ్..!

  • May 26, 2022 / 10:23 AM IST

‘జబర్దస్త్’ షో దాదాపు 8 ఏళ్ళుగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది.ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు.ఆ లిస్ట్ పెద్దదే. అయితే అందులో కిరాక్ ఆర్పీ కూడా ఒకరు. తనదైన పంచులతో అందరినీ నవ్విస్తూ పాపులర్ అయ్యాడు కిరాక్ ఆర్పీ. అయితే కొన్నాళ్ళకి జబర్దస్త్ నుండి బయటకి వెళ్ళిపోయి నాగబాబు రిఫరెన్స్ తో ‘అదిరింది’ లో చేరాడు. కొన్నాళ్ల తర్వాత ‘కామెడి స్టార్స్’ లో కూడా మెరిసాడు.ఇదిలా ఉండగా… డైరెక్టర్ గా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఆర్పీ.

ఆల్రెడీ ఓ ప్రాజెక్టుని కూడా సెట్ చేసుకున్నాడు. అంతేకాదు తన పేరు పై ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా స్టార్ట్ చేసి అందులో తన కొత్త కొత్త వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే మరోపక్క కామెడీ షోల ద్వారా బాగానే సంపాదించాడు. ఇతను లక్కీ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు.

ఈరోజు లక్ష్మీ ప్రసన్నతో కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. కొద్దిపాటి బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ‘జబర్దస్త్’ స్టార్ కమెడియన్లు అయిన ధన్ రాజ్, సినీ పరిశ్రమలో ఉన్న స్నేహితులు ఈ వేడుకకి హాజరయ్యారు.లక్ష్మీ ప్రసన్న నెల్లూరులో ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసిందట.ఇక కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus