జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందినటువంటి కీరాక్ ఆర్పీ ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినటువంటి ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇలా ఈ రెస్టారెంట్ బిజినెస్ లో ఈయన ఎంతో మంచి సక్సెస్ సాధించారు. ఆర్పీ ఈ చేపల పులుసు పేరు మీద ఫ్రాంచైజీస్ కూడా స్టార్ట్ చేసాడు.
ఇప్పటికే అనంతపూర్, బెంగుళూర్, విశాఖ పట్టణాల్లొ ఫ్రాంచైజీస్ ఇచ్చిన (Kiraak Rp) ఆర్పీ ఇప్పుడు హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాల్లో కూడా స్టార్ట్ చేసాడు. కూకట్ పల్లి, మాదాపూర్, అమీర్ పేట ప్రాంతాల్లో ఆర్పీ చేపల పులుసు ఓన్ బ్రాంచెస్ ఉన్నాయి. మిగిలినవన్నీ ఈయన ఫ్రాంచైజీస్ ఇస్తున్నారు.అయితే తాజాగా తన చేపల పులుసు గురించి వస్తున్నటువంటి నెగెటివిటీ పై ఈయన స్పందిస్తూ తన స్టైల్ లో వారికి వార్నింగ్ ఇచ్చారు.
కొందరు ఉద్దేశపూర్వకంగానే పెయిడ్ బ్యాచ్ తన రెస్టారెంట్ బిజినెస్ పై దెబ్బ తీయాలి అన్న ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. చేపల పులుసు రుచి బాగున్న బాగాలేవు అంటు దుష్ప్రచారం చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని తెలిపారు. నా చేపల పులుసు టేస్ట్ కనక బాగా లేకపోతే ఎవరు కొనడానికి రారు.నేను ఈ చేపల పులుసు కోసం ఉపయోగించే చేపలన్నీ కూడా నెల్లూరు నుంచి తెప్పించినవేనని ఈయన తెలిపారు.
నా చేపల పులుసుకు బోలెడంత డిమాండ్ ఉంది. కొన్నిసార్లు అనుకున్న స్థాయిలో సప్లై చేయలేకపోతున్నాను. ఎంతోమంది స్టార్స్ కూడా చేపల పులుసు తీసుకెళ్లడానికి వస్తున్నారు అంటే చేపల పులుసు టేస్ట్ బాగుందని అర్థం. ఇలా ఎంతోమంది పనిగట్టుకొని చేపల పులుసు పై దుష్ప్రచారం చేసిన నాకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. నేను క్లారిటీగా సప్లై చేసినంతవరకు నాకు ఎలాంటి భయం లేదని ఈ సందర్భంగా ఈయన తన చేపల పులుసు గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నటువంటి వారికి వార్నింగ్ ఇచ్చారు.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!