టాలీవుడ్‌లో కొత్తవాళ్లకు ప్రవేశం లేదు.. వారసులు, పరిచయస్థలుకే ఇక్కడ పట్టం కడతారు… అనే మాట వచ్చినప్పుడల్లా వాళ్లందరి నోళ్లు మూయించేలా ఒక కుర్రాడు వస్తుంటాడు. ఇక్కడ ఎవరైనా రాణించొచ్చు, హీరో అవ్వొచ్చు అని నిరూపిస్తుంటాడు. అలాంటి వాడే కిరణ్ అబ్బవరం. ‘రాజా వారు రాణీ గారు’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన కిరణ్‌కి కరోనా పరిస్థితుల వల్ల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత గతేడాది వచ్చిన ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’తో అదరగొట్టాడు.
ఆ వెంటనే చేసిన ‘సెబాస్టియన్’ సినిమా తేడా కొట్టింది. ఇప్పుడు ‘సమ్మతమే’ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతున్నాడు. జూన్ 24న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కిరణ్ గత సినిమాకు ఈ సినిమాకు మూడు నెలల గ్యాపే ఉంది. దీంతో వరుసగా సినిమాలు చేసేస్తూ వస్తున్నారు. దీని వల్ల మీ కెరియర్‌కు ఇబ్బంది అవుతుందేమో అని ఎప్పుడూ అనిపించలేదా అని అడిగితే.. సినిమాల విడుదల విషయంలో నా ప్రణాళిక సరైందేనని భావిస్తున్నా అని చెప్పాడు.
హీరోలు ఏటా వీలైన ఎక్కువ సినిమాలు చేయడమే కరెక్ట్ అని నా అభిప్రాయమన్న కిరణ్ అబ్బవరం… వరుసగా సినిమాలు విడుదలవుతుంటే అందరికీ పని దొరుకుతుంది అని స్పష్టం చేశారు. అయితే వరుస సినిమాలు చేసే క్రమంలో, విడుదల చేసే క్రమంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అని అన్నాడు కిరణ్. అంతేకాదు తను ఖరారు చేసిన సినిమాల దర్శకులు, నిర్మాతలు తనకు బలమని తన సీక్రెట్ చెప్పాడు కూడా.
ఇక మీ ప్రతి సినిమా మధ్యతరగతి నేపథ్యంలోనే సాగుతుంది దానికైమైనా ప్రత్యేకమైన కారణం ఉందా అని అడిగితే.. నాకు మధ్యతరగతి నేపథ్యంలో సాగే కథలంటేనే ఇష్టం. నేనూ మిడిల్ క్లాస్ అబ్బాయిని కావడం వల్ల అలాంటి కథలకు త్వరగా ఆకర్షితుడిని అవుతాను. ‘ఇది మన కథ, మనోడి కథ’ అనే ఫీలింగ్ ఉంటే ఆ కథను వెంటనే ఒప్పేసుకుంటా. మరోవైపు దర్శకనిర్మాతలూ నాకు అలాంటి కథలు సెట్ అవుతాయనుకుంటున్నారేమో అన్నాడు కిరణ్ అబ్బవరం.
* తదుపరి ప్రాజెక్టుల విశేషాలు?
కిరణ్: ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమా ఆగస్టు, ‘వినరో భాగ్యం విష్ణుకథ’ సెప్టెంబరులో విడుదలకానున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో ఓ చిత్రం చేస్తున్నా.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!