Mirai: ‘హను-మాన్‌’ని ఫాలో అవుతున్న ‘మిరాయ్‌’.. ప్లాన్‌ అదుర్స్‌ కదా!

పెద్ద సినిమాలకు, ఎక్కువ బడ్జెట్‌ పెట్టిన సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచడం, ఓ నాలుగైదు రోజులకు టికెట్‌ రేట్లు తగ్గించడం మనం ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అనే కాన్సెప్ట్‌ ఇది. అయితే ఇక్కడ మరో కాన్సెప్ట్‌ కూడా ఉంది. అదే ఇప్పుడున్న రెగ్యులర్‌ రేట్లను కాస్త తగ్గించి అమ్మడం. దీని గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అంటే ‘హను – మాన్‌’ సినిమా నాటి రోజుల్ని గుర్తు చేసుకోవాలి. సాధారణ టికెట్‌ రేట్ల, తగ్గింపు టికెట్ రేట్లు ఆప్షన్‌ను ఇచ్చిన రీసెంట్‌ సినిమా ఇది.

Mirai

ఇప్పుడు ఈ సినిమా స్ట్రాటజీనే ‘మిరాయ్‌’ సినిమా టీమ్‌ కూడా పాటిస్తోంది. అంటే హీరో తేజ సజ్జా తన కొత్త సినిమా టీమ్‌ని పాత సినిమాలా చేయమని అడిగారు అని చెప్పొచ్చు. ‘హను–మాన్‌’ తరహాలోనే ‘మిరాయ్‌’ సినిమాకి కూడా టికెట్‌ రేట్లు తగ్గించారు. దసరా సందర్భంగా ఈ మేరకు మార్పులు చేశామని సినిమా టీమ్‌ చెబుతోంది. తేజ సజ్జా, రితికా నాయక్‌, మంచు మనోజ్‌ ప్రధాన పాత్రల్లో కార్తిక్‌ ఘట్టమనేని రూపొందించిన ఈ సినిమా సెప్టెంబరు 12న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది.

బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటివరకూ రూ.140 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో మరింత మంది ప్రేక్షకులకు సినిమాను చేరువయ్యేందుకు సింగిల్‌ స్క్రీన్‌లో టికెట్‌ ధరలను తగ్గించింది. ‘ఈ దసరాను మీ కుటుంబం, పిల్లలతో కలసి ‘మిరాయ్‌’ సినిమా థియేటర్‌లో జరుపుకోండి. సింగిల్‌ స్క్రీన్‌లో అతి తక్కువ టికెట్‌ ధరకు మూవీని ఆస్వాదించండి’ అని పేర్కొంది. ఈ మేరకు బాల్కనీ టికెట్‌ ధరను రూ.150, ఫస్ట్‌ క్లాస్‌ను రూ.105గా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ‘ఓజీ’ సినిమా ఉన్నా తమ సినిమా వసూళ్లు తగ్గకుండా టీమ్‌ ప్లాన్‌ చేసుకుంది అని చెప్పొచ్చు. ‘హను – మాన్‌’ సినిమా సమయంలో అయితే నెల రోజుల తర్వాత టికెట్‌ ధరలు తగ్గించారు.

నాగ వంశీపై సంక్రాంతి ఒత్తిడి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus