గత వారం సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’, తేజ సజ్జ నటించిన ‘ఇష్క్’ చిత్రాలతో సెకండ్ ఎఫెక్ట్ వల్ల మూతపడ్డ థియేటర్లు తెరుచుకున్నాయి. కానీ ఆ రెండు చిత్రాలకి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు.’ఇష్క్’ మూవీకి ప్లాప్ టాక్ వచ్చింది కాబట్టి.. దానిని పట్టించుకోలేదు జనాలు అనడంలో అర్ధం ఉంది. కానీ హిట్ టాక్ వచ్చిన ‘తిమ్మరుసు’ చిత్రాన్ని కూడా జనాలు పట్టించుకోకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన మొదలైంది.ఈ నేపథ్యంలో తమ సినిమాలను ఓటిటిల్లో రిలీజ్ చేసుకోవడమే బెటర్ అనే నిర్ణయాన్ని మరింతగా సమర్ధించుకుంటున్నారు చాలా మంది దర్శకనిర్మాతలు.
అయితే ఈ వారం విడుదలైన ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. తెలంగాణలో, సీడెడ్ లో చాలా థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడ్డాయి.రెండో రోజుకి, మూడవ రోజుకి కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రేజ్ ఉన్న సినిమాలను పాండమిక్ ను కూడా లెక్క చేయకుండా జనాలు ఆదరిస్తారు అని ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ మూవీ నిరూపించింది.
ఈ క్రమంలో ‘పాగల్’ వంటి మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ కు రెడీ అవ్వడం విశేషం.అంతేకాదు ‘టక్ జగదీష్’ ‘లవ్ స్టోరీ’ వంటి బడా ప్రాజెక్టులు ఓటిటికి వెళ్లడం కరెక్టేనా అనే డైలమాలో పడ్డాయని టాక్ వినిపిస్తుంది. ఏమైనా ఈ కుర్ర హీరో కిరణ్ అబ్బవరం సినిమా వల్ల పెద్ద హీరోల్లోనూ, డిస్ట్రిబ్యూటర్లలోనూ కొత్త ఆశలు చిగురించాయని స్పష్టమవుతుంది.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!