‘రాజావారు రాణిగారు’ తో ఆడియన్స్‌ని ఆకట్టుకుని, ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’తో యూత్‌లో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ కమ్ రైటర్ కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాడు కానీ అంచనాలు అందుకోలేకపోయాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఒకటి.. కష్మీరా కథానాయికగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బ్ననీ వాసు నిర్మిస్తున్నాడు..
ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.. కాన్సెప్ట్ ఏంటి అంటూ నెటిజన్లలోనూ, ఆడియన్స్‌లోనూ క్యూరియాసిటీ కలిగించారు. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైంది. ప్రామిసింగ్‌గా అనిపించడంతో పాటు కిరణ్ ఖాతాలో మరో హిట్ పడుతుందనిపించేలా ఉంది ట్రైలర్.. తిరుపతి నేపథ్యంలో ఓ యువకుడి జీవితంలో జరిగిన ఊహించని సంఘటనల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ అంటూ క్లుప్తంగా కథ చెప్పే ప్రయత్నం చేశారు.
హీరో హీరోయిన్లు ఫోన్ నెంబర్స్ కారణంగా నంబర్ నేబర్స్ అవడం అనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది.. ‘‘మనకో ఫోన్ నంబర్ ఉంటుంది.. దానికి అటు, ఇటు రెండు నంబర్స్ ఉంటాయ్.. వాళ్లు కూడా మన నేబర్స్ అవుతారని నీకెప్పుడైనా అనిపించిందా బాబాయ్?’’ అని చెప్పడం ఆకట్టుకుంటే.. అలా హీరోయిన్ కాల్ చేస్తే ఓవైపు హీరో, మరో వైపు మురళీ శర్మ.. ఇంకో వైపు ఎవరంటే.. విలన్‌ని రివీల్ చేయడంతో ట్విస్ట్ గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తోంది..
‘‘ఆడపిల్లలందరూ ప్రిన్సెస్.. అంటే, వాళ్ల నెత్తి మీద కిరీటముంటుంది.. అది కింద పడకుండా ఉండాలంటే.. వాళ్లెప్పుడూ తల దించుకోకూడదు’’ అనే డైలాగ్ బాగుంది.. చివర్లో.. ‘‘మనకి కష్టమొస్తే ఎవరో సాయం చేయాల్సిన అవసరం లేదు.. పక్కనున్న వాళ్లు చేస్తే చాలు.. ఎవరికి తెలుసు?.. మీ పక్క నంబర్ ఏ సీఎందో, పీఎందో, సచిన్‌దో, ధోనీదో.. పవర్ స్టార్, ఐకాన్ స్టార్, రెబల్ స్టార్‌ది కూడా అయ్యిండొచ్చు..
అలాంటి వాళ్లల్లో ఒక్కరికి ఈ వీడియో రీచ్ అయినా నాకు కచ్చితంగా మంచి జరుగుతుంది’’ అంటూ చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.. దేవి ప్రసాద్, ఆమని, శుభలేఖ సుధాకర్, ఎల్.బి. శ్రీరామ్, ప్రవీణ్ తదితరులు నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది..
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!