కిరాక్ పార్టీ ఫస్ట్ డే కలెక్షన్స్

విభిన్నమైన కథలతో విజయాలను అందుకుంటున్న హీరో నిఖిల్ తొలిసారి పర భాషా కథలో నటించారు. కన్నడ లో హిట్ కొట్టిన స్టోరీతో కిరాక్ పార్టీ చేశారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ సరసన హీరోయిన్స్ గా సంయుక్తా హెగ్డే, సిమ్రాన్ పరీన్జాలు నటించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థపై సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ మూవీ నిన్న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. యువతీ యువకులను ఆకట్టుకుంటున్న ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఆరుకోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఏరియాల వారీగా కలక్షన్స్..

నైజాం : 1.39 కోట్లు
వైజాక్ : 62 లక్షలు
ఈస్ట్ గోదావరి : 38 లక్షలు వెస్ట్ గోదావరి : 28 లక్షలు
గుంటూరు : 42 లక్షలు
నెల్లూరు : 21 లక్షలు కృష్ణ : 31 లక్షలు
సీడెడ్ : 78 లక్షలు
ఇతర రాష్ట్రాల్లో : 59 లక్షలు అమెరికా : 1.2 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా : 6.18 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus