బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ‘రాక్షసుడు’ వంటి డీసెంట్ హిట్ తర్వాత వచ్చిన సినిమా ‘కిష్కింధపురి’. ఇదొక హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు.సెప్టెంబర్ 12న పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.
ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.కానీ ‘మిరాయ్’ కి సూపర్ హిట్ టాక్ రావడంతో ఆ సినిమాని ఆడియన్స్ ఫస్ట్ ఆప్షన్ గా భావించారు.అందువల్ల ‘కిష్కింధపురి’ సెకండ్ ఆప్షన్ అయ్యింది. కలెక్షన్స్ పై కూడా ప్రభావం పడింది. అయినప్పటికీ డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ఈ సినిమా.. వీక్ డేస్ లో చాలా డౌన్ అయ్యింది. అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్ సాధించింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్ట్ :
నైజాం | 4.35 cr |
సీడెడ్ | 1.0 cr |
ఆంధ్ర(టోటల్) | 4.51 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 9.86 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.54 cr |
ఓవర్సీస్ | 0.69 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 11.09 cr (షేర్) |
‘కిష్కింధపురి’ (Kishkindhapuri) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. 10 రోజుల్లో ఈ సినిమాకి రూ.11.09 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా రూ.18.63 కోట్లు రాబట్టింది. ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా రూ.0.09 కోట్ల ప్రాఫిట్స్ తో క్లీన్ హిట్ గా నిలిచింది. కానీ టాక్ ప్రకారం చూస్తే.. ఇంకా బెటర్ ఓపెనింగ్స్ ను రాబట్టే అవకాశం ఉన్నా.. ‘మిరాయ్’ వల్ల అది కుదర్లేదు అనే చెప్పాలి.