ఓ ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ తన ప్రియురాలిని వదిలి వెళ్ళలేక చాలా ఎమోషనల్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ అనే పాపులర్ షో గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడే 11వ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది అంటే ఇది ఎంత సక్సెస్ ఫుల్ షోనో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఇందుకోసం కంటెస్టెంట్లు ఆల్రెడీ ఎంపికయ్యారు. ప్రముఖ సింగర్ మరియు ‘బిగ్‌బాస్’ కంటెస్టెంట్ అయిన రాహుల్ వైద్యతో పాటు వరుణ్ సూద్,
దివ్యంకా త్రిపాఠి అర్జున్ బిజ్లానీ, నిక్కి తంబోలి, అభినవ్ శుక్లా వంటి వారు కంటెస్టెంట్లుగా ఎంపికయ్యారు. ఇక షో నిమిత్తం సౌత్ ఆఫ్రికా వెళ్లాల్సిన టైం వచ్చి ఉండగా దాని నిమిత్తం.. నిన్న రాత్రి ముంబై ఏయిర్‌పోర్టుకు చేరుకున్నాడు రాహుల్. అతనితో పాటు ఆమె ప్రియురాలు దిషా పర్మార్ కూడా వెళ్ళింది. కానీ ఆమెని వదిలి వెళ్ళలేక అతను చాలా ఎమోషల్ అయ్యాడు.ఫైనల్ గా ముద్దులు హగ్గులు ఇచ్చి ఆమెకు వీడ్కోలు చెప్పాడు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :