దూరపు కొండలు నునుపు… పొరిగింటి పుల్లకూర రుచి.. వీటికి ఉదాహరణలు మనం ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన పనిలేదు. సింపుల్ గా మన టాలీవుడ్ నిర్మాతల్ని చూపిస్తే సరిపోతుంది. ఎందుకంటారా? అక్కడికే వస్తున్నా… ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల కంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీనే టాప్ పొజిషన్లో ఉంది. టాలీవుడ్లో మాత్రమే 100 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో ఆల్రెడీ 3 హిట్ అయ్యాయి. ఇంకో 4 లేదా 5 యావేరేజ్ లు పడ్డాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్, కోలీవుడ్ దర్శకులు మన స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎగపడుతున్నారు.
అయితే మన నిర్మాతలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. వాళ్ళు తమిళ స్టార్ హీరోల వెంట పడుతున్నారు. అది కూడా వాళ్ళకి కోట్లకు కోట్లు చెల్లించి మరీ కాల్ షీట్లు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి మన నిర్మాతలు ఇచ్చే పారితోషికాలు చెబితే బిత్తరపోవడం గ్యారెంటీ..! ముందుగా విజయ్ విషయానికి వస్తే.. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఇతను చేయబోతున్న మూవీకి ఏకంగా రూ.100 కోట్లు పారితోషికమట. బహుశా ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలు కూడా ఇంత తీసుకోరేమో. ఇక రెండో హీరో ధనుష్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ఇతను రూ.50 కోట్లు తీసుకుంటున్నాడు.
ఇక మరో హీరో శివ కార్తికేయన్. ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ తో ఇతను చేయబోయే సినిమాకి ఏకంగా రూ.25 కోట్లు తీసుకుంటున్నాడు. వీళ్ళ మార్కెట్ కి డబుల్ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ సినిమాలు ఓకే చేయించుకున్నారు మన టాలీవుడ్ నిర్మాతలు. ఈ టైములో పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకుని వేస్ట్ అని మన టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు భావిస్తుంటే.. తెలుగు ఆడియెన్స్ ను నమ్ముకుని మన టాలీవుడ్ నిర్మాతలు, తమిళ హీరోలు.. చాలా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు