‘నిశ్శబ్దం’ లో అనుష్క అలా వచ్చి చేరింది : కోన వెంకట్

ప్రస్తుతం అనుష్క నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ‘నిశ్శబ్దం’. అయితే ఈ చిత్రం కథ అనుష్క కోసం రాసింది కాదు అంటున్నాడు కథా రచయిత మరియు నిర్మాత అయిన కోన వెంకట్. విషయంలోకి వెళితే అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రం జనవరి 31న విడుదల కాబోతుంది. హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయిగా కనిపించనుంది. కోలీవుడ్ హీరో మాధవన్ మరియు ప్రముఖ హీరోయిన్ అంజలి, షాలిని పాండే వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఇటీవల ఈ చిత్రం గురించి కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చాడు. అయన మాట్లాడుతూ “నిజానికి ఈ కథ అనుష్కను దృష్టిలో పెట్టుకుని రాసింది కాదు. కథ రాసుకున్న తరువాత ఓ స్టార్ హీరోయిన్ తో చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఒకానొక రోజు నేను ముంబై నుండీ హైదరాబాద్ విమాన ప్రయాణం చేస్తున్నాను. అనుకోకుండా అనుష్క కూడా అదే విమానంలో ప్రయాణం చేస్తుంది. ఆ సమయంలోనే ఆమెకి నేను ఈ కథను గురించి చెప్పాను. కొన్ని రోజుల తరువాత అనుష్క కాల్ చేసి ఆ సినిమా చేయడానికి నేను రెడీ అని చెప్పింది. అనుష్క కెరియర్లో ‘అరుంధతి’ ‘భాగమతి’ వంటి చిత్రాల్లానే ‘నిశ్శబ్దం’ కూడా గుర్తుండిపోయే సినిమా అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus