Kona Venkat: కోన గారు ఇది కొంచెం అత్యాశలా లేదూ…!

ఈ మధ్య కాలంలో ఓ సినిమా రేంజ్…ని డిసైడ్ చేయడం ఎవ్వరి వల్లా కావడం లేదు.ఈ ఏడాది సంక్రాంతి సీజన్ ను కనుక గమనిస్తే… ‘హనుమాన్’ (Hanu Man) అనే చిన్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) అనే పెద్ద సినిమాని మించి కలెక్ట్ చేసి ట్రేడ్ కి సైతం షాకిచ్చింది. ఫైనల్ గా చిన్న సినిమా అనుకున్న ‘హనుమాన్’ రూ.350 కోట్లు వసూల్ చేసింది. అలాగే ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) రిలీజ్ అయ్యాక ‘మా సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందని’ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఎంతో ధీమాగా చెప్పారు.

నిజంగానే ఆ సినిమా వంద కోట్లని మించి వసూళ్లు రాబట్టింది. ఇంకా రాబడుతూనే ఉంది. సో తమ సినిమాల కంటెంట్ పై నమ్మకం ఉంటే తప్పులేదు. కానీ ప్లాప్ టాక్ వచ్చాక కూడా ‘మా సినిమా అంత కలెక్ట్ చేస్తుంది.. ఇంత కలెక్ట్ చేస్తుంది’ అని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ఇప్పుడు కోన వెంకట్ కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఏప్రిల్ 11న ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali Malli Vachindhi) సినిమా రిలీజ్ అయ్యింది. దీనికి ప్లాప్ టాక్ వచ్చింది.

అయినప్పటికీ సక్సెస్ సెలబ్రేషన్స్ వంటివి నిర్వహించారు. మరోపక్క కోన వెంకట్ (Kona Venkat) మాట్లాడుతూ.. ‘ఇది అంజలి (Anjali) కెరీర్లో 50 వ సినిమా కాబట్టి.. రూ.50 కోట్లు కలెక్ట్ చేయాలి’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సినిమాకి ఇలాంటి టాక్ వచ్చాక థియేటర్స్ లో జనాలు లేరు. అయినా రూ.50 కోట్లు ఆశిస్తున్నారు కోన. మరోపక్క థియేటర్లలో తీసిన వీడియోలను కూడా పోస్ట్ చేసి ‘మా సినిమాలోని కామెడీని జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు’ అంటూ రివ్యూయర్స్ పై సెటైర్లు కూడా వేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus