సూపర్ స్టార్ మహేష్ బాబు బంగారమని ప్రముఖ రచయిత కోన వెంకట్ చెప్పారు. ప్రిన్స్ దూకుడు చిత్రానికి ఈ రచయిత మాటలను అందించారు. నేటి హీరోలతో అయన పని చేశారు. రీసెంట్ గా కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. “మహేష్ బాబు డైరక్టర్ చెప్పినట్లు చేస్తారు. స్క్రిప్ట్ విషయంలో అసలు వేలు పెట్టరు. అయన పాత్ర విషయంలో కూడా మార్పులు చెప్పరు. రచయితలను, వారి ఆలోచనలను గౌరవించడంలో ప్రిన్స్ బంగారం” అని ప్రశంసించారు.
ఇప్పుడు ఒక సినిమాలో హీరోగా కనిపిస్తే చాలు.. డైరెక్టర్లకి సూచనలు ఇచ్చే స్థాయికి ఎదిగి పోతున్నారు. తన పాత్ర పరిధి మాత్రమే కాదు.. టోటల్ స్రిప్ట్ లోనే ఇన్వాల్వ్ అయిపోయి మార్పులు చెప్పే వారు ఎక్కువ అయిపోతున్నారు. తాజా ఈ సంఘటనలు అనేకం జరిగాయి. కొంతమంది స్టార్ హీరోలు కూడా రచయితలను, డైరెక్టర్లను ఇబ్బంది పెడుతున్న దాఖలాలు ఉన్నాయి. అయితే ఎవరూ బయటకు చెప్పలేక ఉండిపోతున్నారు. పదిహేనేళ్లుగా అనుభవం ఉన్న కోన వెంకట్ ఈ మాట చెప్పడంతో పరిశ్రమలో రచయిత కష్టాలు ఏ మాత్రం ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఇంతకీ కోన మాటలు స్క్రిప్ట్ లో అతిగా ఇన్వాల్వ్ అయ్యే హీరోలకు చేరుతుందో .. లేదో?