రచయితలు దర్శకులుగా మారడం అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు.అప్పటి జంధ్యాల గారి వద్ద నుండీ ఇప్పటి త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్ల వరకు చాలా మంది అలా వచ్చిన వారే. అయితే ఇంకా కొంతమంది స్టార్ రైటర్లు డైరెక్టర్లుగా ఎంట్రీ ఇవ్వాలని చాలా ఏళ్ళ క్రితం నుండే ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఈ లిస్ట్ లో వక్కంతం వంశీ కాస్త లేట్ గా అడుగు వేసాడు.
అతనికంటే లేట్ గురించి చెప్పుకోవాలంటే మనం కోన వెంకట్ గురించి చెప్పుకోవాలి. 1997 వ సంవత్సరంలో ‘తోక లేని పిట్ట’ అనే చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు కోన వెంకట్. కానీ ఆ సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో వెంటనే ఆయన రైటర్ గా మారిపోయారు. ‘ఒకరికి ఒకరు’ అనే చిత్రంతో రైటర్ గా మారిన కోన.. అటు తర్వాత ‘అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి’ ‘ఢీ’ ‘రెడీ’ ‘దూకుడు’ ‘బలుపు’ ‘లౌక్యం’ వంటి ఎన్నో హిట్ సినిమాలకి పనిచేసారు.
దర్శకుడిగా మారాలని 14 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. 2008 లో ఈయన దర్శకుడిగా ఓ మూవీ మొదలైంది కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం కోన.. చిరు- బాబీల మూవీకి పనిచేస్తున్నారు. దాంతో పాటు ఓ పెద్ద హీరోకి సెట్ అయ్యేలా ఓ కథని రాసుకున్నారు. కానీ ఇప్పుడు పెద్ద హీరోలంతా బిజీ బిజీ. అందుకే ఓ యంగ్ హీరోని పట్టారట.
కోన పై నమ్మకంతో ఆ యంగ్ హీరో వెంటనే ఓకె చెప్పేసాడని వినికిడి. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. మరి ఈ ప్రాజెక్టుని ఎవరు నిర్మిస్తారు వంటి వివరాలు తెలియాల్సి ఉంది.