ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ నుండీ రాబోతున్న చిత్రం కొండపొలం.జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఉప్పెన చిత్రం అనుకున్న దానికంటే 3 రెట్లు ఎక్కువగా కలెక్ట్ చేసినప్పటికీ కొండపొలం కి ఎక్కువ బిజినెస్ అయితే జరగలేదు.
అలా అని తీసిపారేసే బిజినెస్ అయితే కాదు. ఒకసారి బిజినెస్ వివరాలను గమనిస్తే :
నైజాం
3.0 cr
సీడెడ్
0.90 cr
ఆంధ్రా(టోటల్)
3.00 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
6.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+
ఓవర్సీస్
0.85 cr
వరల్డ్ వైడ్ టోటల్
7.75 cr
కొండపొలం చిత్రానికి రూ.7.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి రూ.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఓపెనింగ్స్ అంత ఆశాజనకంగా లేవనే చెప్పాలి.