‘క్లైమ్యాక్స్’తో ఆటలాడుతున్న కొరటాల!!!

కధా రచయితగా, మాటల రచయితగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొరటాల శివ. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారి ఆ ఒక్క సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. అయితే ఆ సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకుని ఎంతో మంది హీరోలు కాదన్న కధతో ప్రిన్స్ మహేష్ ను శ్రీమంతుడుగా నిలబెట్టాడు. అయితే ఆ రెండు సినిమాల భారీ హిట్ తరువాత ఇప్పుడు ఎన్టీఆర్ తో సూపర్ హిట్ కొట్టాలి అన్న కసితో జనతా గ్యారేజ్ చేస్తున్నాడు మన దర్శకుడు. ఇదిలా ఉంటే తొలి రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచానలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక అవన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు దర్శకుడు.

ఇక ఇదే క్రమంలో కొన్ని హాట్ న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్ ను కలవర పెడుతుంది. అదేమిటంటే…ఈ సినిమా క్లైమ్యాక్స్ విషయంలో కొరటాల ఆటలాడుతున్నాడు అని, అంతేకాకుండా ప్రయోగాలు చేస్తున్నాడు అని టాక్ బయట బలంగా వినిపిస్తుంది. ఇక అదే క్రమంలో ఈ సినిమాకు రెండు క్లైమ్యాక్స్ లను రెడీ చేసిన మన దర్శకుడు ఆ రెండింటి విషయంలో అందరి అభిప్రాయం తీసుకుని ముందుకుపోనున్నాడు. ఇదిలా ఉండగా… జనతా గ్యారేజ్ మలయాళం వెర్షన్ కు, తెలుగు వెర్షన్ కు కూడా క్లయిమాక్స్ మారిపోనుందని తెలుస్తోంది. మోహన్ లాల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని, మలయాళ జనతా గ్యారేజ్ క్లయిమాక్స్ తీర్చిదిద్దారట. ఇక తెలుగులో ఎన్టీఆర్ ఇమేజ్ , క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని 2 క్లయిమాక్స్ లు తీశారట. మరి ఈ కన్ఫ్యూషన్ డ్రామలో ఏమైనా తేడా వస్తే మాత్రం కొరటాల అభిమానుల ఆగ్రహానికి గురవ్వక తప్పదు. చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus