Koratala Siva: కొరటాలకి మళ్ళీ అదే పరీక్ష… ఈసారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..!

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంభినేషన్‌లో తెరకెక్కిన ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు స్వయంగా చిరు ట్వీట్ చేశారు. ఈపాటికే విడుదలవ్వాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో చకాచకా చిత్రీకరణను కంప్లీట్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఫిబ్రవరి 4 రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఆచార్య‌`లో చిరుకి జంట‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్, చ‌ర‌ణ్‌కి జోడీగా పూజా హెగ్డే నటించనున్నారు. ప్ర‌కాశ్ రాజ్, సోనూ సూద్, జిషు సేన్ గుప్తా, సంగీత కీలక పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు

డిసెంబర్ చివరి వారం , జనవరిలో తెలుగు సినిమాకు మంచి మార్కెట్ జరిగే సమయం. వరుస పండుగలు, సెలవులతో థియేటర్లు కళకళలాడుతుంటాయి. మరి అలాంటి టైంలో కాకుండా అన్‌సీజన్‌ అయిన ఫిబ్రవరిలో ఆచార్యను రిలీజ్ చేస్తుండటంపై ఫిలింనగర్ వర్గాలతో పాటు మెగా ఫ్యాన్స్ సైతం విస్మయం వ్యక్తం చేశాయి. అయితే కొందరు మాత్రం ఒక సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. రైటర్‌గా వున్న కొరటాలను దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం చేసిన ‘మిర్చి’ ఫిబ్ర‌వ‌రి నెల‌లోనే విడుదలై ఘన విజయాన్ని అందుకుంది.

వరుస ఫ్లాపులతో వున్న ప్రభాస్‌కు మళ్లీ బూస్ట్ ఇచ్చారు కొరటాల. 2013 ఫిబ్ర‌వ‌రి 8న రిలీజైన `మిర్చి`.. ఆ ఏడాది భారీ హిట్ అందుకున్న చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. `మిర్చి` త‌ర‌హాలోనే `ఆచార్య‌` కూడా ఫిబ్ర‌వ‌రి సెన్సేష‌న్ గా నిలిచి.. కొర‌టాల శివ ఖాతాలో మ‌రో మెమ‌ర‌బుల్ మూవీ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. మరి రిజల్ట్ ఏంటో తెలియాలంటే ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సిందే.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus