అసోసియేట్‌ డైరెక్టర్‌ తండ్రిని సేవ్‌ చేసిన కొరటాల!

  • September 6, 2020 / 04:37 PM IST

సమాజ హితం గురించి ఆలోచించే దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఆయన సినిమాల్లో హీరోయిజం ఎలివేట్‌ చేసే సన్నివేశాలే కాదు, ప్రజలకు చక్కటి సందేశమూ వుంటుంది. సమాజం గురించిన ఆలోచన ఉంటుంది. సినిమాల్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా సమాజం గురించి ఎంత ఆలోచిస్తారనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

కొన్ని రోజుల కిత్రం కొరటాల శివ అసోసియేట్‌ దర్శకుడు శ్రీనివాస్‌ బత్తిని తండ్రికి కొవిడ్‌19 వైరస్‌ బారినపడ్డారు. హాస్పటల్‌లో బెడ్స్‌ కొరత ఉన్న సమయం అది. అప్పుడు అసోసియేట్‌కి కొరటాల అన్ని విధాల సహాయం చేశారు. తండ్రి కరోనా నుండి కోలుకుని ఇంటికి తిరిగి రావడంతో అసోసియేట్‌ కుటుంబం సంతోషంలో మునిగి తేలింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ బత్తిని ఫేస్‌బుక్‌లో పెద్ద పోస్ట్‌ చేశారు. దాని సారాంశమిది!

‘‘థ్యాంక్యూసార్‌…
కొన్ని రోజుల క్రితం మా నాన్నగారిలో వైరస్‌ లక్షణాలు కనిపించాయి. ఆయన్ను ఒక వీడియో కాల్‌లో చూశా. బ్రీతింగ్‌ సమస్య ఉంది. ఆక్సిజెన్‌ లెవల్స్‌ 90–91 ఉన్నాయి. అక్కడ కొవిడ్‌19 టెస్ట్‌ చెయ్యడానికి అవకాశం లేదు. సిటీ స్కాన్‌కి పంపించాం. పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. మాకు హాస్పటల్‌ బెడ్‌ కావాలి. బయట హాస్పటల్‌ బెడ్‌ ఎవైలబిలిటీ ఎంత బ్యాడ్‌గా ఉందో మనకి ఆల్రెడీ బాగా తెలుసు. కానీ, ఎంత వరస్ట్‌గా ఉంది అనేది నాకు ఆ రోజు తెలిసింది.

ఏం చెయ్యాలో తెలియలేదు. అప్పటివరకూ ఒంట్లో బాలేకపోవడం అంటే ఎంటో తెలుసు. కానీ, ఇంట్లో ఒకరికి ఒంట్లో బాలేకపోవడం అంటే ఏంటో ఫస్ట్‌టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేశా. సిచ్చువేషన్‌ ఎలా హ్యాండిల్‌ చెయ్యాలో తెలియలేదు. టెర్రిబుల్‌ సిచ్చువేషన్‌. సందేహిస్తూ కొరటాల శివ సార్‌కి కాల్‌ చేశా. నిజాయతీగా చెబుతున్నాను. ఆ రోజు ఫోనులో ‘హలో’ అనడానికి కూడా శక్తి లేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయా. సార్‌ నా సిచ్చువేషన్‌ అర్థం చేసుకున్నారు.

బెస్ట్‌ హాస్పటల్‌, బెస్ట్‌ పీపుల్‌, ప్రతిదీ బెస్ట్‌… కొన్ని క్షణాల్లో నాకు అంతా ఇచ్చారు. ఆయన అన్నీ చేశారు. నేను ట్రబుల్‌ ఇవ్వడం తప్ప ఇంకేమీ చెయ్యలేదు. ఒక వారం తరవాత కండీషన్‌ స్టేబుల్‌గా ఉందని, హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటే చాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. మా ఫాదర్‌ ఏజ్‌ ఫ్యాక్టర్‌ వల్ల రిస్క్‌ ఎందుకని ఆయనకు నెగెటివ్‌ వచ్చేవరకూ హాస్పటల్‌ బెడ్‌ బ్లాక్‌ చెయ్యాలని సిల్లీగా ఆలోచించాను.

శివసార్‌కి విషయం చెప్తే ‘ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ లేదు. ఒక బెడ్‌ బ్లాక్‌ చెయ్యడం వలన ఎక్కడో ఎమర్జెన్సీ ఉండి అవసరం ఉన్న ఒక పేషెంట్‌కి బెడ్‌ లేకుండా చేసినట్టు అవుతుంది’’ అన్నారు. ఆయన నాకు హెల్ప్‌ చేస్తూ కూడా, ఆయనకి పరిచయం లేని ఎవరికో కూడా ప్రాబ్లెమ్‌ రాకూడదని ఆలోచిస్తారు. అది కొరటాల శివ అంటే! మిగతా వాళ్ళ కంటే ఆయన్ని స్పెషల్‌ చేస్తోంది. ‘డోంట్‌ పానిక్‌’ అని ఆయన చెబుతున్నా నేను వినకుండా ఎక్కువ ట్రబుల్‌ ఇచ్చా. మైత్రీ మూవీస్‌ చెర్రీగారికి రుణపడి వుంటాను.

అంతా సవ్యంగా జరిగింది. ఈ రోజు నాన్నకు టెస్ట్‌ చేస్తే నెగెటివ్‌ అని వచ్చింది. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. హ్యాపీ ఎండింగ్‌. అయితే నా లైఫ్‌లో టఫెస్ట్‌ సిచ్చువేషన్స్‌ ఇవి. శత్రువులకు కూడా ఇలా జరగకూడదని ఆలోచిస్తున్నా. శివ సార్‌ లేకుండా సిచ్చువేషన్స్‌ ఊహించుకోలేను. మా టోటల్‌ ఫ్యామిలీ హ్యాపీనెస్‌కి శివసార్‌ రీజన్‌. ఆయనకు థ్యాంక్యూ. నా చివరి శ్వాస వరకూ మీ సహాయాన్ని మర్చిపోను. కాలేజీ డేస్‌లో అమ్మా, నాన్నా, చిరంజీవి అని చెప్పేవాడిని. ఈ రోజు నుంచి అమ్మా, నాన్నా, కొరటాల శివ, చిరంజీవి. వృత్తిరిత్యా ఆయన దర్శకుడు. నాకు హీరో లవ్‌యూ సార్‌. థ్యాంక్యూ సార్‌’’ అని శ్రీనివాస్‌ బత్తిని పోస్ట్‌ చేశారు.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus