తెలుగు చిత్ర పరిశ్రమలో వందశాతం సక్సస్ రేట్ కలిగిన దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. అతని దర్శకత్వంలో వచ్చిన నాలుగు సినిమాలు ఇండస్ట్రీ హిట్ సాధించాయి. మహేష్ బాబు తో తెరకెక్కించిన భరత్ అనే నేను 180 కోట్లు కొల్లగొట్టి కొరటాల స్థాయిని పెంచింది. కమర్షియల్ సినిమాల్లో మెసేజ్ ని మిళితం చేయడం నచ్చిన చిరంజీవి అతని దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారు. పిలిచి మరీ కథ రెడీ చేయమని చెప్పారు. విదేశాల్లో విహారం ముగించుకొని హైదరాబాద్ కి వచ్చిన కొరటాల ఆ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం కొరటాల శివ ఎక్కువ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది.
ఇదివరకు చిత్రాలకంటే 25 శాతం ఎక్కువగా రెమ్యునరేషన్ కావాలని అడిగినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. భరత్ అనే నేను సినిమాకి కొరటాల 11 కోట్లు అందుకున్నట్లు సమాచారం. చిరంజీవి 152 వ సినిమాకి 14 కోట్లు కావాలని అడుగుతున్నారు. మరి నిర్మాతలు ఎంత ఫిక్స్ చేస్తారో తెలియాలి. చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర పనులు పూర్తికాగానే రెస్ట్ తీసుకోకుండగానే కొరటాల సినిమాని మొదలు పెట్టనున్నారు.