టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌లలో ఒకరైన కొరటాల శివ, ‘దేవర’ (Devara) సినిమాతో మళ్లీ తన మార్క్ చూపించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) మాస్ లుక్, స్టైలిష్ టేకింగ్‌కి అందరూ ఫిదా అయిపోయారు. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా తర్వాత కొరటాల శివ (Koratala Siva) దేవర సీక్వెల్ ఖచ్ఛితంగా ఉంటుందని ప్రకటించారు. కానీ ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే పరిస్థితి లేదు.
ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా పెద్ద ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. వార్-2 (War 2) సినిమాలో తన పాత్రను ఇప్పటికే కంప్లీట్ చేశారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్‌లో ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్‌కి రెడీ అవుతున్నారు. ఆ తర్వాత నెల్సన్ (Nelson Dilip Kumar) కాంబినేషన్‌లో మరో సినిమా చేయనున్నట్టు టాక్. అయినా కూడా ఎన్టీఆర్ రీసెంట్‌గా మ్యాడ్ స్క్వేర్ (Mad Square) ఈవెంట్‌లో ‘దేవర 2’ తప్పకుండా చేస్తానని క్లారిటీ ఇచ్చారు. దీంతో ‘దేవర 2’ తప్పకుండా వస్తుందన్న నమ్మకమైతే ఉంది కానీ, ఎప్పుడు వస్తుందనేది ఇంకా క్లారిటీ లేదు.
అందుకే కొరటాల శివ (Koratala Siva) ఇప్పుడు తారక్ కోసం వేచి చూస్తారా? లేక మళ్లీ మరో హీరోతో ప్రాజెక్ట్ చేయాలా అన్న చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. ప్రస్తుతానికి టాలీవుడ్ బడా హీరోలంతా బిజీ అవ్వడంతో, కొరటాలకు తక్షణమే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కష్టం అనే అభిప్రాయాలున్నాయి. ప్రభాస్ (Prabhas) నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళి (S. S. Rajamouli) సినిమాలో ఉండటంతో ఆయన రెండు సంవత్సరాలు ఫ్రీ ఉండరని తెలుస్తోంది. అల్లు అర్జున్ (Allu Arjun) అట్లీ (Atlee Kumar) మూవీతో కమిట్ అయ్యారు. రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో ఉన్నారు.
దీంతో కొరటాల శివకు టాప్ హీరోలు అందుబాటులో లేరు. మిడ్ రేంజ్ హీరోలు కూడా వర్క్‌లో బిజీగా ఉండటం వల్ల కొరటాల ముందు ఉన్న ఆప్షన్స్ తక్కువే. ఇప్పుడు చూస్తే కొరటాల స్క్రిప్ట్ వర్క్ పైనే ఫోకస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. తారక్‌కు కథను మరింత పక్కాగా రెడీ చేసి, 2026లో ‘దేవర 2’ని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ మిడ్ రేంజ్ హీరోలు డేట్స్ ఇస్తే, చిన్న స్కేల్‌లో మరో సినిమా చేయవచ్చన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. మరి కొరటాల తదుపరి అడుగు ఏంటో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.